అన్వేషించండి

Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Kolkata: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ ఈ దారుణానికి బలి అయ్యే కొద్ది గంటల ముందు డైరీలో ఓ నోట్‌ రాసుకుంది. గోల్డ్‌మెడలిస్ట్ అవ్వాలనుందని రాసుకున్నట్టు తండ్రి వెల్లడించాడు.

Kolkata Doctor Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ మాటల్లో చెప్పలేనంత హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. నాలుగు పేజీల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనమైంది. "మరీ ఇంత పాశవికమా" అని ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా ఆ షాక్‌లో నుంచి తేరుకోలేదు. కూతురి డెడ్‌బాడీ చూసేందుకు మూడు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో కీలక విషయమూ చెప్పారు. ట్రైనీ డాక్టర్‌కి రోజూ డైరీ రాసే అలవాటు ఉందట. ఈ దారుణానికి కొద్ది గంటల ముందు డైరీ రాసింది. "ఎగ్జామ్‌లో టాప్‌ రావాలి. గోల్డ్‌మెడల్ సాధించాలి" అని రాసుకుంది. ఆ తరవాత ఇంటి నుంచి నైట్‌షిఫ్ట్‌ కోసం హాస్పిటల్‌కి బయల్దేరింది. ఇదంతా బాధితురాలి తండ్రి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. "నా కూతురికి చదువంటే పిచ్చి. రోజుకు 10-12 గంటలు చదువుతూనే ఉండేది. కానీ ఇప్పుడు ఏం మిగిలింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

"నా కూతురు పుస్తకాల పురుగు. రోజంతా బుక్స్‌తోనే గడిపేది. చాలా కష్టపడింది. MD ఎగ్జామ్‌లో టాప్‌ రావాలని అనుకుంది. గోల్డ్ మెడల్ సాధించాలనీ డైరీలో రాసుకుంది. కానీ..ఆ కలలన్నీ చెదిరిపోయాయి. తను డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చేందుకు జీవితంతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో త్యాగాలు చేశాం"

- బాధితురాలి తండ్రి

ఎవరు ఎలా ఓదార్చినా, ఏం ప్రశ్నించినా బాధితురాలి తల్లిదండ్రులు ఒకటే మాట చెబుతున్నారు. "నా కూతురు ఎలాగో చనిపోయింది. కనీసం న్యాయం జరగాలి. ఈ సమయంలో మేం ధైర్యంగా ఉండాలి. నమ్మకం కోల్పోకూడదు. దేశవ్యాప్తంగా మాకు వస్తున్న మద్దతు మాకు ఎంతో ధైర్యాన్నిస్తోంది" అని అంటున్నారు. ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ఈ విచారణ పూర్తి స్థాయిలో జరిగి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముందని తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిందితులకు శిక్ష వేయాలని కోరుకుంటున్నారు. 

Also Read: Upasana: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Tirumala: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
Embed widget