Vizianagaram Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, గుండెపోటు చనిపోయాడని డ్రామా!
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భర్త హత్యకు గురవ్వగా, భార్య జైలు పాలైంది. వీరి ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
వివాహేతర సంబంధాలు(Extramarital Relations) వైవాహిక జీవితాలను నాశనం చేస్తున్నాయి. కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. పిల్లలకు ఆధారం లేకుండా రోడ్డున పడేస్తున్నాయి. ఇలాంటి ఘటననే ఇది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం రాత్రి జరిగిన డేత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లా(Vizianagaram District) బొబ్బలి మండలంలోని పారాదిలో కలిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. వెంకటరమణను అతడి భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిదంటే
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... వెంకటరమణకు లలితకుమారితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లు పారాదిలో నివాసం ఉంటుంది. వీరికి ఐదేళ్ల బాబు హర్షవర్దన్, ఏడాదిన్నర పాప యశస్విని ఉన్నారు. గత కొంతకాలంగా లలితకుమారికి అదే గ్రామానికి చెందిన నరసింగరావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో వెంకటరమణ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో లలితకుమారికి ప్రియుడు నరసింగరావు మెసేజ్ చేశాడు. ఇద్దరు మాట్లాడుకుని ఇంట్లో కలుసుకున్నారు. వంటగదిలో ఇద్దరు ఉండగా భర్త వెంకటరమణకు మెలకువ వచ్చింది. దీంతో నరసింగరావు, వెంకటరమణకు మధ్య వాగ్వాదం జరిగింది. లలితకుమారి, నరసింగరావు దాడిచేసి వెంకటరమణను చున్నీతో ఉరి వేసి హత్య చేశారు. తర్వాత అతని మృతదేహాన్ని ఇంట్లోని ఓ గదిలో పెట్టి, నరసింగరావు పరారయ్యాడు. లలితకుమారి తన బంధువులతో భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. దీంతో బంధువులు ఆమె మాటలు నమ్మి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.
Also Read: భర్తను పశువుల కొట్టంలో పాతేసిన భార్య, పోలీసుల దర్యాప్తులో ఎన్నో అనుమానాలు
వెంకటరమణ శరీరంపై గాయాలు
వెంకటరమణ మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బొబ్బలి గ్రామీణ సీఐ నాగేశ్వరరావు గ్రామానికి వచ్చి విచారణ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేయగా లలితకుమారి నిజం చెప్పింది. దీంతో నిందితులు లలితకుమార్, నరసింగరావును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. వెంకటరమణ హత్యకు గురవ్వగా, లలితకుమారి అరెస్టు కావడంతో వారి పిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డారు. పిల్లలను బంధువుల పర్యవేక్షణలో ఉంచారు.
Also Read: ప్రేమించుకొని తల్లితో వివాహం, ఆమె కూతురిపైనా మోజుపడి పెళ్లికి ఊహించని నాటకం