అన్వేషించండి

Vizianagaram: ప్రేమించుకొని తల్లితో వివాహం, ఆమె కూతురిపైనా మోజుపడి పెళ్లికి ఊహించని నాటకం

ఓ వ్యక్తి మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లి పెళ్లాడతానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు.

మగతోడు లేడని అలుసుగా తీసుకొని ఓ కుటుంబాన్ని వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటన విజయనగరంలో వెలుగు చూసింది. భర్త చనిపోయిన ఓ మహిళను అతను ప్రేమించి పెళ్లాడి.. తర్వాత ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. ఏకంగా 17 ఏళ్ల కూతుర్ని నమ్మించి మరో చోటకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటున్నానంటూ తల్లికే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. చివరికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి బాలిక తల్లికి (భార్యకు) ఫోన్‌ చేసి బాలికను పెళ్లాడతానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. చేసేది లేక ఆ తల్లి విజయనగరం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు శనివారం నాడు మీడియాకు తెలిపారు. విజయనగరం నగరంలో నక్కాన లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు 14ఏళ్ల క్రితమే ఆమె భర్త జబ్బు చేసి చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ తన కుమార్తెను చదివించుకుంటోంది. ప్రస్తుతం కూతురికి 17 ఏళ్లు. స్థానికంగానే ఓ కేటరింగ్‌లో కంపెనీలో పని చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటోంది. 

ఆ సమయంలోనే సురేష్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అది క్రమంగా వారిద్దరి మధ్యా ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇంట్లో ఉన్న కుమార్తెపైన కూడా సురేష్ మోజుపడ్డాడు. అనంతరం ఆమెను మభ్య పెట్టి తిరుపతికి తీసుకెళ్లాడు. సురేష్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి బేరం తిరుపతికి రావడంతో అక్కడికి వెళ్తున్నానని భార్యతో చెప్పాడు. ఒక టికెట్‌ ఖాళీగా ఉందని లక్ష్మికి చెప్పి నమ్మించాడు. కుమార్తె కూడా తనతో పాటు తిరుపతికి వస్తే బావుంటుందని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లిన రెండు రోజుల తర్వాత భార్య లక్ష్మికి ఫోన్‌ చేసి.. బాలిక, తాను పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి కట్ చేశాడు. వెంటనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. మళ్లీ ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు డ్రైవర్ సురేష్‌పై కిడ్నాప్‌ కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. అయితే, అతను బాలికను ఇంకా పెళ్లి చేసుకున్నాడా లేదా అనే అంశం తెలియాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget