Vikarabad Rape: పదో తరగతి బాలికపై యువకుడు రేప్, ఆ వెంటనే ఇంకో ఘోరం
Vikarabad Girl Rape: 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకి వెళ్లిన విద్యార్థిపై అత్యాచారం చేసి, అంతటితో ఆగకుండా నిందితుడు హత్య కూడా చేశాడు.
![Vikarabad Rape: పదో తరగతి బాలికపై యువకుడు రేప్, ఆ వెంటనే ఇంకో ఘోరం Vikarabad man murders minor tenth class girl after rape Vikarabad Rape: పదో తరగతి బాలికపై యువకుడు రేప్, ఆ వెంటనే ఇంకో ఘోరం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/28/0dcb7921be0ae281e297aa993ac1a739_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vikarabad Minor Girl Rape: వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడు పైశాచికానికి ఒడిగట్టాడు. ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, తర్వాత ఆమెను చంపేశాడు. వికారాబాద్ (Vikarabad) జిల్లా పూడురు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారం చేసి, అంతటితో ఆగకుండా నిందితుడు హత్య కూడా చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బహిర్భూమికి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు.
నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం (Vikarabad Girl Rape) లభ్యం కావడంతో వారు కన్నీరు మున్నీరు అయ్యారు. దీంతోనే అసలు విషయం వెలుగు చూసింది. సదరు విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు (Telangana Minor Girl Rape) సంబంధించిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ప్రియుడిపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాయితో మోది బాలికను చంపేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నేరం అనంతరం యువకుడు అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు కూడా మైనరే అని పోలీసులు చెబుతున్నారు. అతని తండ్రి మీడియాతో మాట్లాడాడు. తన కొడుకు అమాయకుడని, ఏమీ తెలీదని చెప్పుకొచ్చాడు. ‘‘మా అబ్బాయి అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్తుండేవాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు వాళ్లు కూడా పిలుస్తారు. కల్లు కోసం కూడా పిలిచేవాళ్లు. ఇద్దరికి పరిచయం ఉంది. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్షపడాలి. కేవలం అనుమానం ఉన్నందునే పోలీసులు మా అబ్బాయిని తీసుకెళ్లారు. పొద్దున మేం దావత్ చేసుకున్నం. అప్పటిదాకా మాతోనే ఉన్నడు. పొద్దున 7 గంటలకు మాకు ఆ అమ్మాయి చనిపోయినట్లుగా విషయం తెలిసింది. ఆ టైంలో మా అబ్బాయి మాతోనే ఉన్నాడు’’ అని నిందితుడి తండ్రి అన్నారు.
Also Read: Kamareddy Accident: పేలిన ఆర్టీసీ బస్సు టైరు, కారును ఢీ - ఐదుగురు అక్కడికక్కడే మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)