Vijayawada: నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసు... ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణం... సెల్ఫీ వీడియోతో వెలుగులోకి కీలక విషయాలు
విజయవాడలో నిజామాబాద్ కు చెందిన కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం శనివారం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ కుటుంబం రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. తమ ఆత్మహత్యకు కారణమైన వారి వివరాలను ఈ నోట్ లో రాశారు. సూసైడ్ నోట్‌తో పాటు ఓ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఆ వీడియోను బంధువులకు పంపించారు. ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ వీడియోలో వెల్లడించారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోను పోలీసుుల స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
Also Read: విజయవాడలో నిజామాబాద్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య
ఫైనాన్స్ వేధింపులే ఆత్మహత్యకు కారణం
కుటుంబ సభ్యులు నలుగురి మృతదేహాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఫైనాన్స్ వేధింపులే ఆత్మహత్యలకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కుటుంబాన్ని వేధించిన నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేశారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం నిన్న ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read: ప్రభుత్వ పథకాలు కావాలంటే నా కోరిక తీర్చాలి... వెలుగులోకి మరో కాలకేయుడి ఆగడాలు
Also Read: 'నువ్ లేకుంటే నేను లేను.. నువ్ ఎప్పటికీ నాకు అన్నయ్యవే' మహేష్ భావోద్వేగం..
విజయవాడలో ఆత్మహత్యలు
నిజామాబాద్ జిల్లాకు చెందిన పప్పుల సురేష్ కుటుంబంలోని 4 గురు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. అనంతరం కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నిజామాబాద్ జిల్లా అచన్ పల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులను పప్పుల సురేష్ (46), శ్రీలత (42) దంపతులతో పాటు కొడుకు అఖిల్ (26), ఆశిష్ (22)లుగా గుర్తించారు.
Also Read: మా ఇండస్ట్రీ నుంచి మరో బ్రిలియంట్ సినిమా.. 'శ్యామ్ సింగరాయ్'పై చరణ్ ప్రశంసలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి