అన్వేషించండి

Vijayawada Crime : బెజవాడలో రౌడీషీటర్ల ఆటకట్టిస్తున్న పోలీసులు, బంగారం చోరీ కేసును ఎలా ఛేదించారంటే?

Vijayawada Crime : బెజవాడలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. బిజీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసి ప్రజలను బెదిరించి బంగారం, నగదు దోచుకెళ్తుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలపై తరచూ ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Vijayawada Crime : బెజ‌వాడ లో రౌడీషీట‌ర్లపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ర‌ద్దీ ప్రాంతాల‌ను టార్గెట్ గా చేసుకొని ఇష్టానుసారంగా బెదిరింపుల‌కు పాల్పడి, అమాయ‌కుల నుంచి బంగారం, న‌గ‌దుతో పాటుగా విలువైన ఆభ‌ర‌ణాల‌ను దోచుకోవటం ఇటీవ‌ల కాలంలో వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ వ్యవ‌హ‌రంపై తరచూ పోలీసుల‌కు ఫిర్యాదులు అంద‌టంతో ప్రత్యేక బృందాల‌ను రంగంలోకి దింపిన పోలీసులు రౌడీషీట‌ర్ల క‌ద‌లిక‌ల పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా విజయవాడ సౌత్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల ఆగడాలపై పోలీసుల‌కు అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. జూన్ ఐదో తేదీన బీసెంట్ రోడ్ లో ఒక వృద్ధుడు మెడలో నుంచి బంగారం గోలుసు చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తు రికవరీ చేసిన‌ట్లు ఏసీపీ వెల్లడించారు. వీరిపై రౌడీషీట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. 

ఆభరణాలు చోరీ 

గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ రవి కిరణ్ మాట్లాడుతూ.. ఈనెల ఐదో తేదీ రాత్రి 10 గంటల సమయంలో గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో కోసం వేచి ఉన్న ఒక వృద్ధుడి మెడలో నుంచి బంగారం చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులు జాన్ పాల్ రత్నకుమార్, నాగ గౌతంగా గుర్తించారు. వీరు నైజాం గేట్ వద్ద చోరీ చేసిన ఆభ‌ర‌ణాల‌ను అమ్ముతున్న సమయంలో పోలీసులు మెరుపు దాడి చేసి నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నార‌ని వివరించారు. రూ.16 వేల నగదుతో పాటు బంగారు లాకెట్ ను రికవరీ చేసి వారిని అదుపులోకి తీసుకోని కోర్టుకు హాజరు ప‌రిచామ‌ని తెలిపారు. నిత్యం ర‌ద్దీగా ఉండే బెజ‌వాడ బీసెంట్ రోడ్డులో ఈ త‌ర‌హా సంఘ‌ట‌న వెలుగులోకి రావ‌టం క‌లకలం రేపింది. దీంతో పోలీసులు కూడా ఈ కేసు ద‌ర్యాప్తును కీల‌కంగా తీసుకున్నారు. నిందితులు అత్యంత చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రించారు. సంఘ‌ట‌న జ‌రిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకుండా జాగ్రత్త  ప‌డ్డారు.

నిందితులు జాగ్రత్త పడినా చిక్కారు!  

నిందితులు పోలీసుల‌కు క్లూ దొరక్కుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా చోరీల‌కు పాల్పడాల‌ని ప్లాన్ వేసిన‌ప్పటికీ, చివ‌ర‌కు చ‌ట్టానికి చిక్కకుండా ఎక్కువ దూరం వెళ్లలేక‌పోయారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసుల‌కు సెల్ ఫోన్ సిగ్నల్స్ కీల‌కంగా మారాయి. సంఘ‌ట‌న‌న జ‌రిగిన ప్రదేశంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుల‌ను గుర్తించ‌గ‌లిగారు. సీసీ కెమెరాల నిఘాను త‌ప్పించుకున్న, నిందితులు సెల్ ఫోన్ సిగ్నల్స్ కు సంబంధించిన ఆధారాల‌ను దాటి వెళ్లలేక‌పోయారు. ఈ కేసులో ప్రతిభ క‌న‌బ‌ర‌చిన‌ కానిస్టేబుల్ కు నగదు రివార్డును అందించారు. ఈ కేసు ద‌ర్యాప్తు లో  సీఐ సురేష్ బాబుతో పాటు ఎస్సైలు పాల్గొన్నారని వివ‌రించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget