(Source: ECI/ABP News/ABP Majha)
Vizianagaram Violence : విజయనగరంలో కుటుంబం మధ్య గ్యాంగ్ వార్ - యువకుడి దారుణ హత్య !
విజయనగరం జిల్లాలో కుటుంబం కత్తులతో ఘర్షణకు దిగింది. ఒక వ్యక్తి చనిపోయాడు.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు లో ఒకే కుటుంబానికి చెందిన ఇరువర్గాల మద్య కొట్లాటలో ఓ వ్యక్తి చనిపోయారు. రెండు వర్గాలు గ్యాంగ్ వార్ తరహాలో కొట్లాటకు దిగారు. కళ్లల్లో కారం చల్లి కత్తులు , కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి చనిపోగా.. నలుగురు కి గాయాలు . పద్మ , గీత అనే ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని గేదెల గణేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన అతడిని 008 లో గజపతినగరం తీసుకుని వెళ్తూండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తీవ్ర గాయాలైన పద్మ , గీత లను గజపతినగరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి కత్తిపోట్లు పడ్డాయి. వారిని కూడా ఆస్పత్రికి తరలించారు.
గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణం : మృతుడి భార్య ఆరోపణలు
ఈ కుటుంబంలో జ్యోతి అనే రెండు రోజుల కిందట అదృశ్యమయింది. ఆమె హత్యకు గురయిందని శనివారం వెల్లడయింది. కుమిలి రోడ్ లోని దయాల్ నగర్ ..బేతన పల్లి మధ్యలో ఓ యువతి మృతదేహం శనివారం లభ్యమైంది. ఆమె వయస్సు సుమారు 25 ఏళ్ళు ఉంటుంది. దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పంపించడంతో ఆమె శరీరం మొత్తం కాలిపోయింది. శనివారం అటుగా వెళుతున్న కొంతమంది చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఒంటరిగా మహిళ కనిపించే సరికా రాబందులైన ఆటోడ్రైవర్లు - మేడ్చల్ జిల్లాలో గ్యాంగ్ రేప్ !
ఆ యువతి అదశ్యమైన జ్యోతి మృతదేహమేనని గుర్తించారు. ఆమె హత్యకు గేదెల గణేష్ కారకుడని యువతి బంధువులు భావించినట్లుగా తెలుస్తోంది. యువతి హత్యతో మృతురాలి కుటుంబం ప్రతీకారంతో రగిలిపోయింది. జ్యోతి ఆత్మకు గణేష్ .. అతని కుటుంబీకులే కారణం అని దాడులు చేశారు. నిజానికి దాడులు చేసిన వారు కూడా మృతుడు గణేష్ కుటుంబానికి రక్త సంబంధీకులే. అయినప్పటికీ జ్యోతి తల్లి దండ్రులు.. వారి బంధువులు కత్తులతో వచ్చి వీరంగం సృష్టించారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మళ్లీ దాడులు జరగకుండా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమా ? గ్రామంలో ఏం జరుగుతోందంటే ?