IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Hyderabad Gang Rape : ఒంటరిగా మహిళ కనిపించే సరికి రాబందులైన ఆటోడ్రైవర్లు - మేడ్చల్ జిల్లాలో గ్యాంగ్ రేప్ !

మేడ్చల్ జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతోంది. నలుగురు ఆటో డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

FOLLOW US: 

కాస్త నిర్మానుష్యంగా ఉండి ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు  మానవ రూపంలోని రాబందులు దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. హైదరాబాద్ శివారులో మరో సామూహిత అత్యాచర ఘటన వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి గండిమైసమ్మ లో అర్ధరాత్రి మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా పోలీస్ కేస్ నమోదయింది. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి రెండు రోజుల క్రితం ఓ ముఫ్పై ఏళ్ల మహిళ నగరానికి వచ్చింది.  గండి మైసమ్మ దగ్గర ఆ మహిళ ఒంటరిగా ఉండటం చూసిన నలుగురు కామాంధులు చెరబట్టాలని నిర్ణయించుకున్నారు. 

గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమా ? గ్రామంలో ఏం జరుగుతోందంటే ?

గండిమైసమ్మ లోని ఉజ్వల బార్ వెనకాల ఖాళీ ప్రదేశం ఉండటంతో మహిళను బలవంతంగా అక్కడకు తీసుకెళ్లారు. అత్యాచారం చేశారు. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు వేగంగా స్పందించారు.  వారు వచ్చే సరికి ఆ నలుగురూ ఇంకా అత్యాచార ప్రదేశంలోనే ఉన్నారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఇమామ్ అనే ఇరవై ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గరు పరారయ్యారు. పరారైన వారిని కుద్దుస్, ఉమృద్ధిన్, నరసింహ గా గుర్తించారు. వీరంతా 23 ఏళ్ల లోపు యువకులే. 

పోలీస్ ఇంట్లోనే చోరీ చేసిన దొంగ ! ఆ తర్వాత సీన్ ..

నిందితులు నలుగురూ ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. గండి మైసమ్మ సర్కిల్‌లో ఆటోలు పెట్టి నడుపుతూ ఉంటారు . నేర ప్రవృత్తి ఉండటంతో మహిళ ఒంటరిగా కనిపించడంతో  లైంగిక దాడికి పాల్పడ్డారు.  పోలీసులు వీరిని గుర్తించి.. అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు చేశారు.  ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా మేడ్చల్ పోలీసులు అనేక సార్లు ఆటోడ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనేక సార్లు నేరారోపణలు .. డ్రైవర్లపై వచ్చాయి.  పోలీసులు ఎంత నిఘా పెట్టినా కొంత మంది భయపడటం లేదు. 

దివ్యాంగురాలైన బాలికపై యువకుడు అత్యాచారయత్నం, తోటలోకి తీసుకెళ్లి దారుణం!

ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు.  ఆ మహిళను వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ బంధువులు ఎవరూ లేకపోతే.. మహిళాసంరక్షణ కేంద్రానికి పంపించే అవకాశం ఉంది.

Published at : 30 Apr 2022 02:47 PM (IST) Tags: Crime News gang rape Medchal district Gandi Mysamma Gang Rape

సంబంధిత కథనాలు

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Kakinada News :  డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు,  పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు