By: ABP Desam | Updated at : 29 Apr 2022 05:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బాలికపై అత్యాచారయత్నం
Vizianagaram Crime : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దివ్యాంగురాలైన బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులతో అటుగా వెళ్తున్న మహిళలు స్పందించి అక్కడి వెళ్లడంతో యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజాం మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన బాలికపై అదే గ్రామానికి చెందిన సామంతుల హరి అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్కూల్ నుండి వస్తుండగా ఇంటి వద్ద దిగపెడతానని మాయమాటలు చెప్పి మార్గమధ్యలో ఓ తోట లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక అరవడంతో అటువైపుగా వెళ్తోన్న కొంతమంది మహిళలు వెంటనే వెళ్లి బాలికను కాపాడారు. అప్పటికే యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు రాజాం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దుగ్గిరాలలో మరో ఘటన
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. శృంగారపురం గ్రామంలో ఓ మహిళపై కొందరు అత్యాచారయత్నం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీ పనుల కోసం వచ్చిన మహిళ ఆలయంలో నిద్రపోతున్న సమయంలో కొందరు యువకులు అత్యాచారయత్నం చేశారు. నిద్రపోతున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.
హనుమకొండలో దారుణం!
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మైనర్ బాలికపై యువకులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. పాఠశాల ఆవరణలోనే ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : Konaseema News : ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై యువతి న్యాయపోరాటం, డీఎన్ఏ టెస్ట్ సస్పెన్స్!
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే
Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎలక్షన్
Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!