Ganji Prasad Murder Update : గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమా ? గ్రామంలో ఏం జరుగుతోందంటే ?
గంజి ప్రసాద్ హత్య లో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి వర్గాన్ని ఆయన ప్రోత్సహించారని అంటున్నారు.
![Ganji Prasad Murder Update : గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమా ? గ్రామంలో ఏం జరుగుతోందంటే ? MLA Talari Venkatrao was involved in the murder of Ganji Prasad alleges YSRCP Leaders Ganji Prasad Murder Update : గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమా ? గ్రామంలో ఏం జరుగుతోందంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/ead7aa70f5a5b5632500d0b41e641471_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడికి కారణం అయిన వైఎస్ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు నిందితులు అనూహ్యంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఉదయమే గంజి ప్రసాద్‌ను గ్రామంలో అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. తామే హత్య చేశామని చెప్పి పోలీస్స్టేషన్లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అదే గ్రామానికి చెందిన సురేష్, మోహన్, హేమంత్లు లొంగిపోయిన వారిలో ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత గంజి ప్రసాద్ దారుణహత్య - ఆపై ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల దాడి
గోపాలపురం నియోజకవర్గంలోని జి.కొత్తపల్లి గ్రామం వైఎస్ఆర్‌సీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గం గంజి ప్రసాద్ కాగా.. మరో వర్గం ఎంపీటీసీ బజారియా నేతృత్వంలో ఉంటుంది. రెండు వర్గాల మధ్య తరచూ ఆధిపత్య పోరాటం కారణంగా వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇద్దరూ ఒకే పార్టీ నేతలు కావడంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇరువురితోనూ సఖ్యతగా ఉంటారు. కానీ స్థానిక ఎన్నికల్లో ఆయన బజారియా వర్గానికి ప్రాదాన్యత ఇచ్చారు. ఆయనకు ఎంపీటీసీ స్థానం కేటాయించారు. దీంతో గంజి ప్రసాద్ వర్గానికి ప్రాధాన్యత తగ్గింది.
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు, నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
ఆ తర్వాత కూడా గ్రామానికి సంబంధించిన వివిధ పనుల విషయంలో కూడా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బజారియా వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో గంజి ప్రసాద్ వర్గం అసంతృప్తితో ఉంది. గ్రామంలో రెండు వర్గాల మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ వివాదాల క్రమంలో గంజి ప్రసాద్‌ను చంపాలనుకున్న బజారియా వర్గం ఆ మేరకు ప్లాన్ చేసుకుని శనివారం ఉదయమే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామస్తులు తిరుగుబాటు చేస్తారని ముందుగానే గుర్తించి.. చంపేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతే సేఫ్‌గా ఉంటామని వారు అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు వారు ప్లాన్ అమలు చేశారు.
ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై యువతి న్యాయపోరాటం, డీఎన్ఏ టెస్ట్ సస్పెన్స్!
హత్య చేసినట్లుగా అంగీకరించిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు పోలీసులకు లొంగిపోయారు. కానీ బజారియా మాత్రం ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. బజారియాకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడి ఈ హత్య చేయడానికి ప్రోత్సహించారని ఎమ్మెల్యేలపై గంజి ప్రసాద్ వర్గీయులు, గ్రామస్తులు మండి పడుతున్నారు. ఆయన ప్రోత్సాహం లేకపోతే బజారియా ఇంత దారుణానికి పాల్పడేవారు కాదంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)