By: ABP Desam | Updated at : 30 Apr 2022 11:16 AM (IST)
వైఎస్సార్ సీపీ నేత హత్య
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేత, గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను కొందరు దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. దాంతో ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి కొత్తపల్లికి చెందిన కొందరు దాడి చేశారు. ఏమి చేయలేని పరిస్థితిలో పోలీసులు చూస్తుండిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల నుంచి బాధితుల్ని రక్షించాడానికి వచ్చిన పోలీసులపై దాడి చేయడం మరింత వివాదానికి కారణమైంది.
జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యంతో గంజి ప్రసాద్ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ గంజి ప్రసాద్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై సైతం మరో వర్గానికి చెందిన వైసీపీ నేతలు, కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
ఎమ్మెల్యేపై దాడికి కారణం ఇదేనా ?
వైఎస్సార్‌సీపీ నేత గంజి ప్రసాద్‌ను కొందరు దుండగులు కత్తులతో నరికి హత్య చేయగా.. ఇందులో పార్టీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హస్తం ఉందని మరో వర్గం నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తలారి వెంకట్రావుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాద్ హత్యకు కారకుడువు నీవే, నీకు ఇందులో హస్తం ఉందని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన మరో వర్గం నేతలు ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. దాడి భయంతో ఎమ్మెల్యే స్కూల్లోకి వెళ్లి పోలీసుల సాయంతో అక్కడే తలదాచుకున్నారు.
జి కొత్తపల్లికి ఎస్పీ, అదనపు బలగాలు
వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య, ఆపై ఎమ్మెల్యేపై దాడి.. అడ్డుకునే యత్నం చేసిన పోలీసులపై సైతం జి.కొత్తపల్లి గ్రామస్తులు, మరో వర్గానికి చెందిన వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. దాంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏలూరు ఎస్పీ కొత్తపల్లికి వెళ్తున్నారు. మరోవైపు గ్రామంలో పరిస్థితులు చేయిదాటేలోపు చర్యలు తీసుకోవడంలో భాగంగా అదనపు బలగాలను కొత్తపల్లికి పంపించారు ఎస్పీ. గ్రామంలో పరిస్థితి మరింత అదుపు తప్పకుండా చేసేందుకు పోలీసులు, అదనపు బలగాలు తీవ్రంగా యత్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాలా, రాజకీయ కక్షతో గంజి ప్రసాద్‌ను హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Yadadri Building Collapse : యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండు అంతస్తులు భవనం, నలుగురి మృతి!
Also Read: CM Jagan on Ramya Case : రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు తీర్పు చరిత్రాత్మకం : సీఎం జగన్
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
Jeedimetla News : ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టేసిన పిల్లలు
Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!