అన్వేషించండి

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

బాలుడి మిస్సింగ్ కేసును వేములవాడ పట్టణ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. బిడ్డను క్షేమంగా తల్లి ఒడికి చేర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

రోజుల చిన్నారి మిస్సింగ్ కేసును వేములవాడ పట్టణ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. బిడ్డను క్షేమంగా తల్లి ఒడికి చేర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద మాములు రోజుల్లోనే విపరీతమైన రద్దీ ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రాజన్న దర్శనం కోసం వచ్చి వసతి సౌకర్యాలు దొరకకుంటే ఎక్కడో ఒక ప్రాంతంలో తలదాచుకుంటారు. ఇలా దర్శనం కోసం వచ్చిన ఓ జంటకి చేదు అనుభవం ఎదురైంది.

 ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తలు 27 రోజుల బాలుడిని అపహారించారు. బాలుడి తల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. బాలుడి అపహరణ కి సంబందించిన వివరాలు డిఎస్పీ వెల్లడించారు. కరీంనగర్ శాంతినగర్ కు చెందిన లావణ్య భర్త తో విబేధాల కారణంగా తన ఇద్దరు కొడుకులు సనత్ కుమార్ (2), చిన్న బాలుడు (27 రోజులు )ను తీసుకొని గత నాలుగు రోజుల క్రితం వేములవాడ దేవాలయం వద్దకు వచ్చి ఒంటరిగా ఆలయ మెట్ల వద్ద ఉంటుంది. 

మెట్ల వద్ద తనకు సునీత మరియు ఆమె భర్త రవితేజలు పరిచయం అయ్యారు. ఆదివారం రాత్రి లావణ్య ఉదయం 3 గంటల ప్రాంతంలో వర్షం వచ్చేసరికి లేచి చూసుకోగా తన చిన్న కొడుకు కనిపించలేదు. పక్కన వున్న చాడి సునీత, చాడి అభితేజ @రవితేజ ఇద్దరు కూడా కనిపించలేదు. బాబును వారే ఎత్తుకెళ్లారు అని అనుమానంతో గుడి చుట్టూ వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఉదయం 6గంటల ప్రాంతంలో పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆలయ ప్రాంగణంలో ఉన్న సిసి ఫుటేజ్ పరిశీలించి అక్కడినుండి సమీపంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ లకు సమాచార ఇవ్వటం జరిగిందని తెలిపారు. 

Also Read: Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్

సీసీ పుటేజీని పరిశీలిస్తూ బృందాలు దర్యాప్తులో భాగంగా వెళ్లగా వరంగల్ బస్టాండ్ లో బాలునితో సహా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు డిఎస్పీ చంద్రకాంత్ వెల్లడించారు.  గంటల వ్యవది లో ఇట్టి కేసు ను చేదించిన ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ని అభినందించారు. వేములవాడ లాంటి రద్దీ ప్రాంతాలకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కొత్తవారితో జాగ్రత్తగా మెలగాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు.

 

టాప్ హెడ్ లైన్స్

Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Fake High Court Judge: హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget