US Priest Crime: పేరుకు పాస్టరే కానీ చేసిన పని మాత్రం మహా పాపం - 17 ఏళ్ల వయసు నుంచి ఆ యువతిని...
US Priest: అమెరికాలో ఓ పాస్టర్ మైనర్ బాలికను చెరబట్టాడు. ఇటీవల ఆ బాలిక ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటపెట్టడంలో అమెరికాలో సంచలనం సృష్టించింది.

US Priest Accused Of Having Affair With 17 Year Old Stripper: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 61 ఏళ్ల కాథలిక్ ప్రీస్ట్ రాబర్ట్ సుల్లివన్ ఒక బాలికను లోబర్చుకుని ఏళ్ల తరబడి రహస్యంగా ఆమెతో లైంగిక సంబంధాలు నెరపుతున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి లక్షల డాలర్లు చెల్లించారు.
రాబర్ట్ అలబామాలోని హోమ్‌వుడ్‌లో ఉన్న అవర్ లేడీ ఆఫ్ సారోస్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్ల ప్రీస్ట్. 2009లో 17 ఏళ్ల యువతి, హీథర్ జోన్స్ ను ట్రాప్ చేశారు. ఆమె వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. హీథర్ జోన్స్ తల్లి నిరాదరణకు గురై.. స్ట్రిప్ క్లబ్‌లో డాన్సర్‌గా పనిచేస్తున్న సమయంలో రాబల్ట్ ఆ క్లబ్ కు తరచూ వచ్చేవాడు. రాబర్ట్ ఆమెకు టిప్స్ ఇచ్చేవాడు. అలాగే "ప్రైవేట్ కంపానియన్‌షిప్" కోసం $273,000 (సుమారు రూ. 2.3 కోట్లు) చెల్లించి నాన్-డిస్క్లోజర్ ఒప్పందం (NDA) కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో లైంగిక సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె తాజాగా బయట పెట్టారు.
🚨 ALABAMA PRIEST SCANDAL ROCKS CATHOLIC COMMUNITY 🚨
— ⁿᵉʷˢ Barron Trump 🇺🇸 (@BarronTNews_) August 15, 2025
Father Robert Sullivan, 61 — longtime pastor of Our Lady of Sorrows Church in Homewood, Alabama, and Vicar General of the Birmingham Diocese — is facing explosive allegations from a woman who says he began a sexual… pic.twitter.com/IGFCE9BFRV
17 ఏళ్ల వయసులో తల్లి తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జోన్స్ ఆర్థికంగా, మానసికంగా హాని స్థితిలో ఉంది. ఆ సమయంలో ఒత్తిడి కారణంగా ఒప్పందానికి అంగీకరించినట్లు పేర్కొంది. ఒప్పందం తర్వాత, ఒక న్యాయవాది కార్యాలయం నుండి ఆమెకు డబ్బులు చెల్లించారు. రాబర్ట్ తనను వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. పాస్టర్ అని చెప్పలేదు. జోన్స్‌ను షాపింగ్, డైనింగ్, మద్యపానం, కనీసం ఆరు నగరాల్లోని హోటళ్లకు తీసుకెళ్లినట్లు ఆమె వివరాలు వెల్లడించింది. ఈ సంబంధం ఇటీవలి వరకు కొనసాగింది. ఇటీవల కూడా ఆమె ఖాతాకు ద్వారా సుమారు $120,000 (సుమారు రూ. 1 కోటి) బదిలీ చేశాడు.
ఇప్పుడు ఆమె ఎందుకు వివరాలు బయట పెట్టాల్సి వచ్చిందో కూడా వివరించింది. చర్చి పాస్టర్ అని ఆలస్యంగా తెలిసిందని ఇప్పుడు ఆయన పిల్లలతో పని చేస్తున్నందున ఆ పిల్లల రక్షణ కోసమే తాను బయటకు వచ్చి చెబుతున్నానని ప్రకటించింది. ఆమె బ్యాంక్ రికార్డులు, ఈమెయిల్, లీగల్ ఒప్పందం కాపీలను బయట పెట్టింది.
రాబర్ట్ 32 సంవత్సరాలకు పైగా పాస్టర్ గా సేవలందించాడు. ఆరు సంవత్సరాల పాటు జాన్ కారోల్ హైస్కూల్‌లో ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఆరోపణల కారణంగా అవర్ లేడీ ఆఫ్ సారోస్ చర్చి నుండి సస్పెండ్ చేశారు.




















