Crime News: మేనకోడలితో రెండేళ్లుగా వివాహేతర సంబంధం, వేరే పెళ్లికి ఒప్పుకుందని దారుణ హత్య
UP Crime: యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మేనకోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెని దారుణంగా హత్య చేశాడు. వేరే పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో చంపేశాడు.
UP Man Kills Niece: యూపీలో దారుణ ఘటన జరిగింది. మేనకోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె వేరే పెళ్లి చేసుకుంటోందన్న కోపంతో కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి చంపాడు. హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. నిందితుడు మణికాంత్ ద్వివేది ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో పాతిపెట్టాడు. పోలీసులకు అనుమానం రాకుండా ఆమె సెల్‌ఫోన్‌ని ఓ బస్‌లో విసిరేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...మానసి పాండే రక్షాబంధన్ పండుగ రోజు మణికాంత్ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. తన కూతురిని కిడ్నాప్ చేశాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మణికాంత్‌ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారించారు. దాదాపు రెండేళ్లుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు చెప్పాడు నిందితుడు. ఇటీవలే మరో వ్యక్తితో పెళ్లి కుదిరిందని, అది ఇష్టం లేకే చంపేశానని అంగీకరించాడు. డెడ్‌బాడీ పాతిపెట్టిన చోటుకి వెళ్లిన పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం పంపించారు. బాధితురాలి తండ్రి ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
"నా కూతురి కోసం నేను తిరగని చోటంటూ లేదు. మా సొంతూరికి వెళ్లి ఆరా తీశాం. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఆ తరవాత మణికాంత్ నాకు ఫోన్ చేశాడు. అమ్మాయి తప్పిపోయిందని చెప్పాడు. ఫోన్ స్విచాఫ్ వస్తోందని అన్నాడు. ఎవరితోనో వెళ్లిపోయిందనీ చెప్పాడు. నాకెందుకో అతనిపైనే అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాను. నవంబర్‌లో నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను. తను పెళ్లి చేసుకోవడం మణికాంత్‌కి ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాడు"
- బాధితురాలి తండ్రి
Also Read: Kolkata: నా కొడుకు అమాయకుడు, అంతా కలిసి ఇరికించారు - కోల్‌కతా కేసు నిందితుడి తల్లి