Kolkata: నా కొడుకు అమాయకుడు, అంతా కలిసి ఇరికించారు - కోల్‌కతా కేసు నిందితుడి తల్లి
Kolkata Case: తన కొడుకుని ఎవరో కావాలనే ఈ కేసులో ఇరికించారని, ఏ తప్పూ చేయలేదని కోల్‌కతా హత్యాచార నిందితుడి తల్లి వెల్లడించింది. ఇరికించిన వాళ్లకీ శిక్ష పడుతుందని తేల్చి చెప్పింది.
Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార నిందితుడి గురించి ఇప్పటికే రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల్ని వేధిస్తాడని, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని విచారణలో తేలింది. అంతే కాదు. ఈ దారుణానికి పాల్పడే ముందు రెడ్ లైట్ ఏరియాకి వెళ్లొచ్చాడని వెల్లడైంది. దేశమంతా అతని పేరు చెబితేనే భగ్గుమంటోంది. కానీ నిందితుడి తల్లి మాత్రం నా కొడుకు అమాయకుడనే అంటోంది. ఎవరో తన కొడుకుని ఈ కేసులో ఇరికించారని చెబుతోంది. తనను ఎంతో బాగా చూసుకునే వాడని, కుటుంబాన్ని పోషించే వాడని అంటోంది. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది నిందితురాలి తల్లి.
"నా కొడుకు చాలా రోజుల పాటు నాతోనే ఉన్నాడు. కానీ ఈ మధ్యే ఇంటికి రావడం లేదు. పోలీసులతో పాటు ఉంటున్నాడు. ఈ ఘటన గురించి నాకు తెలిసింది. నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. ఈ కేసులో చాలా మంది హస్తం ఉంది. వాళ్లంతా కలిసి నా కొడుకుని ఇరికించారు. ఇలా చేసిన వాళ్లందరికీ త్వరలోనే తప్పకుండా శిక్ష పడుతుంది"
- నిందితుడి తల్లి
పొరుగింటి వాళ్లు చెప్పే వర్షన్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. అతని క్యారెక్టర్ మంచిది కాదని, వస్తున్నాడంటేనే తలుపులు మూసుకునే వాళ్లమని చెబుతున్నారు. పొరుగింటి వాళ్లు చెప్పే వర్షన్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. అతని క్యారెక్టర్ మంచిది కాదని, వస్తున్నాడంటేనే తలుపులు మూసుకునే వాళ్లమని చెబుతున్నారు. చూస్తేనే భయపడిపోయే వాళ్లమని అంటున్నారు. ఇక నిందితుడి సోదరి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంజయ్ రాయ్ ఈ పని చేశాడంటేనే నమ్మలేకపోతున్నామని అంటోంది. 17 ఏళ్లలో ఎప్పుడూ ఈ ఇంటికి రాలేదని, కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించింది. వార్తలు చూస్తుంటే షాకింగ్‌గా ఉందని, తప్పు చేశాడని తేలితే మాత్రం చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే అని తేల్చి చెప్పింది.
RG Kar Medical College and Hospital rape-murder case | Permission for polygraph test of former principal Dr Sandip Ghosh and 5 others granted by Sealdah Court. The 5 others include 4 doctors who had dinner with the deceased doctor and 1 civic volunteer.
— ANI (@ANI) August 23, 2024
సెప్టెంబర్ 5వ తేదీ వరకూ నిందితుడు సంజయ్ రాయ్‌ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇకపై సీబీఐ విచారణ ముమ్మరం కానుంది. ఇప్పటికే లై డిటెక్టర్ టెస్ట్‌కి అనుమతి తెచ్చుకుంది. ఎప్పుడు ఈ పరీక్ష చేస్తారన్నది త్వరలోనే అధికారులు వెల్లడించనున్నారు. అంతకు ముందు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నాడు సంజయ్ రాయ్. ఇప్పుడు మరో 14 రోజుల పాటు కస్టడీలోనే ఉండనున్నాడు. నిందితుడితో పాటు మరో నలుగురికీ ఈ కేసులో లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తోంది. ఇందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంటోంది.