Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య!
Nandyal Constable Murder: నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ నే కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు.. బీర్ బాటిల్స్, కత్తులతో పొడిచి మరీ అతడిని హత్య చేయడం కలకలం రేపుతోంది.
Nandyal Constable Murder: నంద్యాల జిల్లా కేంద్రంలోని డీఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహించే కానిస్టేబుల్ సురేంద్రను కత్తులతో పొడిచి చంపిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఏ సమస్యలు వచ్చినా ప్రజలను కాపాడే పోలీసునే హత్య చేశారు కొందరు దుండగులు. ముందుగా కిడ్నాప్ చేసి.. ఆపై కత్తులతో, బీర్ బాటిల్స్ తో పొడిచి మరీ దారుణంగా చంపేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. నంద్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లోనే పనిచేస్తున్నారు. శివారులో నివాసం ఉండే కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యారు.
అడ్రస్ కావాలంటూ వచ్చి కిడ్నాప్ చేశారు.. ఆపై
పోలీస్ స్టేషన్ లో పనులన్నీ పూర్తయ్యాక కానిస్టేబుల్ సురేంద్ర ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలోనే పట్టణంలోని రాజ్ థియేటర్ వద్దకు రాగానే కొందరు వ్యక్తులు వచ్చి సురేంద్రతో మాట కలిపారు. ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగారు. అంతలేనో అంతా కలిసి సురేంద్రను గట్టిగా పట్టుకని కారులోకి లాగారు. ఆ తర్వాత అతడిని పట్టణ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోంచి బయటకు దింపి కత్తులతో దారుణంగా పొడిచారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ సురేంద్ర అక్కడికక్కడే చనిపోయారు. ఆపై నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
అయితే ఈరోజు ఉదయం అటుగా వెళ్లిన స్థానిక ప్రజలు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని కానిస్టేబుల్ డెడ్ బాడీని చూసి షాక్ కు గురయ్యారు. తమతో పని చేసే కానిస్టేబుల్ సురేంద్రనే ఇంత దారుణంగా చనిపోయి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సహా అధికారులంతా సురేంద్ర మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం సురేంద్ర మృతదేహాన్ని స్థానిక నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!
కానిస్టేబుల్ హత్యతో కేసును సీరియస్ గా తీస్కున్న పోలీసులు..
కానిస్టేబుల్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానిస్టేబుల్ నే ఇంత దారుణంగా చంపడంతో పోలీసులు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు. అసలు కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు వంటి విషయాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సురేంద్ర కుటుంబ సభ్యులను కూడా విచారించారు. సురేంద్రకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అంటూ ప్రశ్నించారు. అతడికి ఎవరూ శత్రువులు లేరని.. ఉద్యోగానికి అని వెళ్లిన తమ కొడుకు శవంగా మారి రావడం ఏంటంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమరుడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంత దారుణంగా తమ కుమారుడిని హత్యే చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
రౌడీషీటర్లు, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపట్ల పోలీసులు ఉదాసీన వైఖరితో ఉండటం వల్లనే నిందితులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !