అన్వేషించండి

Telangana Bomb Threat: తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టులకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Bomb Threat To Telangana high Court: తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులను పేల్చివేస్తామని నిందితులు మెయిల్స్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ హైకోర్టుతో పాటు నాంపల్లి సీబీఐ కోర్టును పేల్చివేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు, హైకోర్టుకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో పోలీసులు రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 

వరుసగా బాంబు బెదిరింపులు.. అసలేం జరుగుతోంది..
ఇటీవల ఫిబ్రవరి 18, 2026 (బుధవారం) నాడు మొదటగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రాగా, మళ్ళీ ఫిబ్రవరి 20 (శుక్రవారం) నాడు రెండోసారి అదే తరహా బెదిరింపు రావడంతో లాయర్లు, సిబ్బంది, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలో ఆర్‌డీఎక్స్ (RDX) అమర్చినట్లు, అవి మధ్యాహ్నం సమయంలో పేలుతాయని ఇటీవల టైం కూడా ఆ మెయిల్స్‌లో మెన్షన్ చేశారు. బాంబు బెదిరింపు మెయిల్ సమాచారం అందుకున్న వెంటనే అబిడ్స్, నాంపల్లి పోలీసులు అప్రమత్తమై, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే  ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ బెదిరింపులు అని పోలీసులు పేర్కొన్నారు.

ఇటీవల కేవలం నాంపల్లి కోర్టుకే కాకుండా, కరీంనగర్ జిల్లా కోర్టుకు, నగరంలోని పలు ఆస్పత్రులకు సైతం బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే. ఈ వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు కోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? వీటి వెనుక ఉన్నది ఎవరు.. తమకు అన్యాయం జరిగిందని ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారా.. లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  పదేపదే ఇలాంటి బెదిరింపులు ఎందుకు వస్తున్నాయో అర్థంకాక కోర్టు సిబ్బందితో పాటు, కేసు విచారణకు హాజరయ్యే వారు సైతం ఆందోళనకు గురవుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Telangana Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !
రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
Embed widget