By: ABP Desam | Updated at : 27 Dec 2022 01:40 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
అన్నమయ్య రాజాంపేట జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌లో వెళ్తున్న వ్యక్తిపై కారం చల్లి అత్యంత కిరాతంగా హత్య చేసిన ఘటన మదనపల్లెలో కలకలం రేపుతుంది. మదనపల్లె - బెంగళూరు జాతీయ రహదారిలోని జవుకపల్లె తోపు వద్ద సోమవారం రాత్రి ఓ వ్యక్తిని తల నరికి మొండెం వేరు చేసి తలను ఎత్తుకెళ్ళారు దుండగులు. స్ధానికుల సమాచారంతో ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు..
అన్నమయ్య రాజాంపేట జిల్లా నిమ్మనపల్లెకు చెందిన రమేష్ మదనపల్లె ఓ ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్ తరచూ బయట ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్ళి వచ్చేవాడు. అయితే సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు బయల్దేరాడు. మదనపల్లె - బెంగళూరు జాతీయ రహదారిలోని జవుకపల్లె తోపు వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి మదనపల్లె రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మదనపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఎత్తు కెళ్ళిన తల భాగం లభ్యం అయితే గానీ కేసు ఛేదించేందుకు వీలు లేదంటున్నారు. అందుకే తల ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. సంఘటన స్ధలంలో డాగ్ స్క్వాడ్ పిలిపించి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన స్ధలంలో క్లూస్ కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకూ పోలీసులు తల భాగం కోసం పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు.
పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ధారబురుజు వద్ద జరిగిన హత్య కేసులో రమేష్ ఏ2 ముద్దాయిగా ఉన్నాడు. అందులో బాధితులేమైనా రియాక్ట్ అయ్యారా అని ఖాకీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధారబురుజు వద్ద జరిగిన హత్య సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా కూడా ఈ హత్య పెను సంచలనంగా మారుతోంది.
ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన కేసులు చాలా సంచలనంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్నఢిల్లీలో ప్రియురాలిని హత్య చేసి ముక్కలు చేసి ఢిల్లీ నగర వీధుల్లో పడేశాడో ప్రియుడు. తాజాగా బిహార్ కు చెందిన ఓ వ్యక్తి తన చెల్లెలి ప్రియుడిపై కోపం పెంచుకుని నిరకేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకు ఆహారంగా వేశాడు.
బిహార్ కు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయిపోతున్నా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. బిట్టు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అడిగారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో అతడు తరచుగా వెళ్లే ప్రాంతాల్లో గాలించారు. అక్కడ కూడా అతని ఆచూకీ లభించకపోవండతో.. డిసెంబర్ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రాహుల్ పై అనుమనం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా... రాహుల్ నేరాన్ని అంగీకరించాడు.
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!
Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?
Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?