అన్వేషించండి

Tirupati Crime News: లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు.. పిల్లలకు ఉరేసి, తల్లి ఆత్మహత్య.. తిరుపతిలో కన్నీళ్లు పెట్టించే ఘటన

Woman Suicide | తిరుపతి జిల్లాలో విషాదం చోటుచసుకుంది. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోగా, అప్పులు చేస్తూ పోతున్నాడు. దాంతో ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది.

తిరుపతి జిల్లా పుత్తూరులో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యత లేకుండా తిరగడంతో పాటు దొరికిన చొటల్లా అప్పులు చేయడంతో మనస్తాపం చెందిన పద్మ(28) అనే వివాహిత, తన ఇద్దరు కుమార్తెలు తేజ(6), లాస్య(5)లను ఉరేసి చంపి, ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న తన జీవితం ఇతరులకు ఒక గుణపాఠం కావాలని ఆమె రాసిన సూసైట్ నోట్ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. జిల్లాలోని పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన పద్మ, శివశంకర్‌లు డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. శివశంకర్ తో పెళ్లికి పద్మ తల్లిదండ్రులు నిరాకరించారు. అతడు ఏ పని లేకుండా తిరుగుతున్నాడని, కులాలు సైతం వేరు అని పద్మను పెద్దలు మందలించారు. కానీ పెద్దలను ఎదిరించి 2019లో పద్మ, శివశంకర్ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తరువాత మారని భర్త.. భారీగా అప్పులు

సాధారణంగా బాధ్యత లేకుండా ఉండే వారు పెళ్లయ్యాక సెట్ అవుతారని పెద్దలు చెబుతుంటారు. కానీ అందరి విషయంలో అది నిజం కాదని పద్మ ఘటనే నిరూపించింది. పెళ్లయ్యాక కూడా శివశంకర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. జాబ్ చేయడం లేదు. ఏ పని చేయకపోగా వీలున్న చోటల్లా అప్పులు చేస్తూ వచ్చాడు. ఇద్దరు పిల్లలు తేజ, లాస్యలు పుట్టినా భార్యను, పిల్లల బాధ్యత తీసుకోలేదు. ఇంటి అద్దె చెల్లించడానికి, మరోవైపు పిల్లల స్కూలు ఫీజుల కోసం  పద్మ ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం వీరు పిల్లల చదువుల కోసం పుత్తూరులో నివాసం ఉంటున్నారు.

డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఆమె కొంత లోన్ తీసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి శివశంకర్ ను మందలించగా కుటుంబాన్ని పోషిస్తానని, బాధ్యతగా ఉంటానని చెప్పాడు. కానీ తీసుకున్న అప్పును భర్త తీర్చకపోవడం, పిల్లలకు స్కూల్ ఫీజులు, వారి పోషణ సైతం బారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటి నుంచి వెళ్లిన భర్తను అప్పు గురించి అడకడంతో చెల్లించలేదని చెప్పాడు. దాంతో అవమాన భారాన్ని తట్టుకోలేక, పిల్లల్ని పోషించలేక పద్మ కఠిన నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు చీరతో ఉరేసింది. తరువాత తాను హాల్లో ఉరేసుకుని చనిపోయింది. ఇంటికి వచ్చిన భర్తకు డోర్ తెరవకపోవడంతో అనుమానం వచ్చి మామకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చాక తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు చనిపోయి కనిపించారు. పోలీసులు శివశంకర్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

కష్టాలు వివరిస్తూ సూసైడ్ నోట్..

పెద్దల్ని ఎదరించి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అమ్మాయికి అస్సలు నచ్చని లక్షణాలన్నీ నా భర్తకు ఉన్నాయి. పిల్లలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పులు తీర్చకపోతే, కుటుంబాన్ని పోషించకపోతే నేనేం చేయాలి. ఇక ఉంటాను. నేను చనిపోయాక మళ్లీ పెళ్లి చేసుకుంటావు, అయితే సెటిల్ అయ్యాక చేసుకో అని పద్మ సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Embed widget