News
News
వీడియోలు ఆటలు
X

Tollywood Drugs CAse ED : డ్రగ్స్ కేసు సాక్ష్యాలు కావాలి - మరోసారి కోర్టులో ఈడీ పిటిషన్ !

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సాక్ష్యాల కోసం మరోసారి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన సాక్ష్యాల్లో డిజిటల్ సాక్ష్యాలు లేవని తెలిపింది.

FOLLOW US: 
Share:

Tollywood Drugs CAse ED :  టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వదిలి పెట్టట్లేదు. మరో సారి సాక్ష్యాల కోసం కోర్టును ఆశ్రయించింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 2017 డ్రగ్స్ కేసుకు సంబంధించి సాక్ష్యాలను ఎక్సైజ్ శాఖ పూర్తిగా తమకు ఇవ్వలేదని తెలిపింది. ఆ కేసులో 12 సెల్ ఫోన్లను సీజ్ చేశారని .. ఎక్సైజ్ కోర్టులో సబ్ మిట్ చేశారని ఈడీ పిటిషన్‌లో తెలిపింది. సాక్ష్యాల కోసం గతంలో ఈడీ హైకోర్టుకు కూడా వెళ్లింది. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడంతో చివరికి ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. చివరికి ఎక్సైజ్ అధికారులు సాక్ష్యాలు ఇచ్చారు. అయితే వాటిలోనూ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌లు లేవని ఈడీ అధికారులు చెబుతున్నారు. నిందితుల సెల్ ఫోన్లు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో ప్రధానంగా కోరింది. 

Also Read: kharif Crops: రైతులకు కేంద్రం శుభవార్త- 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులే కీలకంగా ఉన్నారు.  హైకోర్టు ఆదేశాలతో గతంలో ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో..  కీలకమైన వాంగ్మూలాలు   డిజిటల్ ఆధారాలు ఉన్నాయని అనుకున్నారు. వాటి ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయనుకున్నారు. కానీ ఇవ్వలేదని ఈడీ తాజా పిటిషన్ ద్వారా వెల్లడయింి.  ఇప్పటికే ఈడీ అధికారులు ఓ సారి ప్రశ్నించారు. కానీ అప్పుడు వారికిఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో ఎవరూ బయటపడలేదు. దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చారు. 

Also Read:CM Mamata Banerjee In Alipurduar: వివాహ వేడుకలో దుమ్మురేపిన దీదీ- ఫోక్ డ్యాన్స్‌కు సోషల్ మీడియా షేక్!

నిజానికి ఈడీ దర్యాప్తు చేసేది డ్రగ్స్ వాడారా లేదా అనేది కాదు… డ్రగ్స్ కోసం చెల్లింపులు ఎలా చేశారన్నదానపైనే. అక్రమ నగదు లావాదేవీల కోణంలోనే ఈ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు చెల్లించిన విషయం బయటకు వస్తే.. నిజంగానే వారు డ్రగ్స్ కొన్నట్లుగా తేలిపోతుంది.  ఈడీ విచారణలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కోసం డబ్బులు చెల్లించినట్లుగా బయటపడితే… ఇక చిక్కులు తప్పనట్లే. ఆ ఒక్కలింక్ నుంచి మొత్తం ఈడీ బయటకు లాగే అవకాశం ఉంది. ఎలా చూసినా టాలీవుడ్‌ను మళ్లీ డ్రగ్స్ కేసు వెంటపడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సాక్ష్యాలు మాత్రం ఇంకా ఈడీ చేతికి చిక్కడం లేదు. 

Published at : 08 Jun 2022 09:13 PM (IST) Tags: tollywood drugs case Petition in ED Court ED Drugs Case

సంబంధిత కథనాలు

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ