News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tirupati Accident : తిరుపతిలో ఘోర ప్రమాదం, ఫ్లై ఓవర్ పై నుంచి పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Tirupati Accident : అతివేగం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చిత్తూరు నగర శివారులోని తిరుపతిలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

FOLLOW US: 
Share:

Tirupati Accident : శ్రీ సత్యసాయి జిల్లా గుడ్డల పల్లెకు చెందిన చైతన్య అనే యువతి, తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పున్నపువరి పాళ్యానికి చెందిన వెంకట సుబ్బయ్య కుమారుడు తిరగబత్తిన మస్తాన్ చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. వాళ్లిద్దరూ శనివారం మధ్యాహ్నం AP 26  BY 3257 నంబరు గల ద్విచక్రవాహనంపై స్థానిక దొడ్డి పల్లెలోని ఫ్లైఓవర్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చిత్తూరు తాలూకా స్టేషన్ ఇంఛార్జ్ ఎస్ఐ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని వారి బంధువులకు అందజేశారు పోలీసులు. సంఘటన స్థలానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలోచేరుకుంటున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు.

టైలర్ లాల్ హత్య నిందితులు బీజేపీ వాళ్లా ? వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు !

పల్నాడులో రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద ముగ్గురు వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని టీ తాగుతున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనం అతివేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీ వ్యాపారి సంతగుడిపాడు కు చెందిన నామాల రాజశేఖరరెడ్డి (22), లారీ క్లినర్ బిల్లా కోటేశ్వరరావు (46) లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి లారీ డ్రైవర్ కొల్లబత్తుల రాజేష్ అని గుర్తించారు. 

ఉన్నట్టుండి ఫ్లైట్‌లో పొగలు, అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం-ఎక్కడంటే?

టీ తాగేందుకు లారీ ఆపితే

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ రాజేష్‌ను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. టీ తాగేందుకు రోడ్డుపై లారీ నిలిపి శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. లారీడ్రైవర్, క్లినర్ లు ఒంగోలు జిల్లా తూర్పు నాయుడు పాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి రొంపిచర్ల పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.

Also Read : Udaipur Murder : అమరావతిలో ఉదయ్‌పూర్ తరహా హత్య - రంగంలోకి ఎన్‌ఐఏ !

Also Read : Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Published at : 02 Jul 2022 06:50 PM (IST) Tags: Road Accident AP News Tirupati News two students died

ఇవి కూడా చూడండి

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్

Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్

Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం

Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది