Udaipur killer BJP member : టైలర్ లాల్ హత్య నిందితులు బీజేపీ వాళ్లా ? వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు !
రాజస్థాన్‌లో ఓ టైలర్‌ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు బీజేపీకి చెందిన వారని కాంగ్రెస్ పార్టీ ఫోటోలు విడుదల చేసింది. అయితే ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్లు బీజేపీ వాళ్లు ఎలా అవుతారని అధికార పార్టీ ప్రశ్నిస్తోంది.
Udaipur killer BJP member : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను మంగళవారం దారుణంగా తల నరికి చంపిన హంతకులు రియాజ్ అఖ్తరీ, గోస్ మొహమ్మద్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. నిందితులు బీజేపీ నేతలతో కలిసి దిగిన ఫొటోల ఆధారాలను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
BJP President @JPNadda ji,
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 2, 2022
Kindly see the pictures of the terror accused from #Udaipur with Your BJP MLA and Opposition leader in Rajasthan assembly Gulab Singh Kataria .
What #NationalExecutiveMeeting will discuss?
How 2give safe passage to him ?
What a shameless party BJPis? pic.twitter.com/StwnLsakAn
కన్హయ్యను చంపిన కిల్లర్స్‌లో ఒకరైన రియాజ్ అఖ్తరీ రాజస్థాన్ బీజేపీ మైనారిటీ సెల్‌లో కీలక సభ్యుడని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ మైనార్టీ సెల్ నేతలైన ఇర్షాద్ చైన్‌వాలా, మహ్మద్ తాహిర్‌తో ప్రధాన నిందితుడు దిగిన ఫొటోలను మీడియా ఎదుట బయటపెట్టారు. అంతేగాక రాజస్థాన్ బీజేపీ నేత, మాజీ మంత్రి గులాబ్‌చంద్ కటారియా కార్యక్రమాల్లో కూడా రియాజ్ పాల్గొన్న ఫోటోలు కూడా విడుదల చేశారు.
श्री @Pawankhera जी ने आज की प्रेस कॉन्फ्रेंस के सनसनीखेज खुलासे में #उदयपुर हॉरर आरोपी मोहम्मद रफीक के बीजेपी के गुलाब चंद कटारिया के साथ संबंध और पार्टी के कई कार्यक्रमों में उनकी भागीदारी पर सबूत साझा किए। pic.twitter.com/UPbrPLKVlH
— TeriMonk (@teri_monk) July 2, 2022
Udaipur's BJP leader Terror Riyaz Attari, who killed tailor Kanhaiyalal.
— Gaurav Pandhi (@GauravPandhi) July 2, 2022
The NIA should probe how Pakistan based terror outfit & BJP are working hand in glove to spread communal hatred in India! pic.twitter.com/CALcKgBX2x
హంతకులు బీజేపీకి చెందిన వారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కేసును తొక్కిపెట్టేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తునకు అప్పగించిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రవక్తపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కన్హయ్య లాల్‌ను చంపిన నిందితులు బీజేపీ సభ్యులు కాదని ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్నవన్నీ తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలని విమర్శించారు. ఫోటోలు సాక్ష్యాలు కాదని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో ఉగ్రకోణం ఉందని.. కేంద్రం భావిస్తోంది. అందుకే ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించింది.