అన్వేషించండి

Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

మనలో కొంతమందికి పడుకునే టైమ్ లో లైట్ ఉంటేనే నిద్రపడుతుంది. మరి కొంతమందికి లైట్ ఉంటే అస్సలు నిద్ర పట్టదు అంటారు. అయితే లైట్ ఉంచుకుంటే మంచిదా లేకుండా ఉంటే మంచిదా అంటే

మనలో కొంతమందికి పడుకునే టైమ్ లో లైట్ ఉంటేనే నిద్రపడుతుంది. మరి కొంతమందికి  లైట్ ఉంటే అస్సలు నిద్ర పట్టదు అంటారు. అయితే లైట్ ఉంచుకుంటే మంచిదా? లేకపోతే మంచిదా అంటే.. లైట్ లేకుండా పడుకోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. చికాగోకి చెందిన ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం లైట్ ఉంచి పడుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తేలింది.

రాత్రి పూట లైట్ వేసుకుని పడుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్త పోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టు తేలింది. చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఫీన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ దీని మీద అధ్యయనం చేసింది. ఆక్స్ ఫర్డ్ అకడమిక్ స్లీప్ ప్రచురించిన కథనం ప్రకారం.. 63 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 552 మందిని 7 రోజుల పాటు పరిశీలించి ఈ అధ్యయనం చేశారు.

అధ్యయనం చేసిన డా. మింజే కిం ‘మెడికల్ న్యూస్ టుడే’తో మాట్లాడుతూ ‘‘రాత్రి పూట లైట్ వేసుకుని పడుకోవడం వల్ల పెద్ద వాళ్ళలో అనారోగ్య సమస్యలు వచ్చినట్లు మేం గమనించాం. వారిలో ఎక్కువ మంది ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక ఒత్తిడిని వాళ్ళు  ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తక్కువ కాంతిలో వాళ్ళు పడుకుంటే సరిగా నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నట్టు మేం గ్రహించాం” అని ఆయన చెప్పుకొచ్చారు.  

“నిద్రలేవడానికి కొన్ని గంటల ముందు ఫ్రాగ్మెంటేడ్ స్లీప్ లోకి మనం వెళ్తాం. గది చీకటిగా ఉండటం వల్ల నిద్రాభంగం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది” అని ముంబయిలోని జైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. రాకేశ్ రాజ పురోహిత్ చెప్పుకొచ్చారు. నిద్రించే సమయాల్లో  లైట్ ఉండటం వల్ల ఆ కాంతి మన నిద్రకి ఆటంకం కలిగించడం తో పాటు నిద్రించే సమయం తగ్గుతుందని మరో డా. అంకిత మూలే అంటున్నారు. “గది చీకటిగా ఉంచుకుని నిద్రపోవడం వల్ల మన శరీరం నుంచి melatonin హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రొమ్ము, ప్రొస్టేట్ కాన్సర్ సహ ఇతర వ్యాదులతో పోరాడేందుకు సహాయపడుతుంది. గది చీకటిగా ఉండటం వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది” అని డా. షా తెలిపారు. అంతే  కాకుండా మన కళ్ళకి విశ్రాంతిని ఇవ్వడంతో పాటు వాటిని కాపాడుతుందని ఆయన అన్నారు. మీకు లైట్ లేకుండా నిద్రపట్టదు అని అనుకుంటే కొద్దిగా వెలుతురు ఉండేలాగా చూసుకోవడం ఉత్తమం. చిన్న బెడ్ లైట్ పెట్టుకుని కొద్దిసేపటి తర్వాత అది పూర్తిగా ఆరిపోయే విధంగా ఉండేలా చూసుకోవాలి. 

Also Read: దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు కనిపిస్తాయా? ఈ వాస్తవాలు మిమ్మల్ని షేక్ చేస్తాయ్!

Also Read: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

టాప్ హెడ్ లైన్స్

Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Embed widget