News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

అత్త కుమార్తెను గత 13 ఏళ్లుగా ప్రేమించాడు.. ఇరువురు పెళ్ళి చేసుకోవాలని‌ పలుమార్లు ‌ప్రయత్నించినా పెద్దలు అడ్డుకోవడంతో వీరి వివాహ ప్రయత్నాలు పెళ్లి వరకూ వెళ్లలేదు.

FOLLOW US: 
Share:

మనస్సుకు నచ్చిన‌ వారు ఎదురైతే జీవితాంతం వారితోనే జీవితాన్ని పంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. అయితే ప్రేమించుకున్న వారంతా వివాహాల వరకూ వెళ్ళరు. అలాగని ప్రేమించి‌ పెద్దలను ఒప్పించి‌ పెళ్ళి చేసుకున్న వాళ్ళంతా ప్రేమగా ఉండలేరు అన్న దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా 13 ఏళ్ళుగా ప్రేమించి జీవితాంతం ఆమెతో కలిసి‌ ఉండాలన్న ఎన్నో కలలు కన్న ఓ యువకుడి‌ ఆశలు నెరవేరక పోవడంతో చివరికి ఆత్మహత్య పాల్పడి ప్రాణాలను‌ సైతం వదిలాడు. అసలు ఏం జరిగిందంటే!

తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, రెడ్డివారిపల్లెకు‌ చెందిన‌ చిన్నంగారి‌ మురళీ మోహన్‌ ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఐతే అదే గ్రామానికి చెందిన అత్త కుమార్తెను గత 13 ఏళ్లుగా ప్రేమించాడు.. ఇరువురు పెళ్ళి చేసుకోవాలని‌ పలుమార్లు ‌ప్రయత్నించినా పెద్దలు అడ్డుకోవడంతో వీరి వివాహ ప్రయత్నాలు పెళ్లి వరకూ వెళ్లలేదు. మురళీ ‌మోహన్ అనేక సార్లు ప్రియురాలి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసినా అందుకు వారు అంగీకరించలేదు.. దీంతో గతంలో ఓసారి మురళీ మోహన్ పురుగుల‌ మందును‌ సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. 

సరైన సమయంలో కుటుంబ సభ్యులు చూసి మురళీ మోహన్‌ను ఆసుపత్రికి ‌తరలించడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. అటు తర్వాత మురళీ మోహన్ తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏ మాత్రం ‌పట్టించుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సైతం జరిగాయి. ఈ క్రమంలో యువతికి మరో యువకుడితో ఎవరికి తెలియకుండా పెళ్ళి చేయాలని భావించారు. మురళీ మోహన్ ను పెళ్ళి చేసుకుంటే తాము అంతా చనిపోతామని కుటుంబ సభ్యులు బెదిరించడంతో వేరే మార్గం లేక యువతి మరొకరితో వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంది. 

ఈ క్రమంలోనే‌ యువతి కుటుంబ సభ్యులు గురువారం తెల్లవారుజామున వివాహం జరిపించారు. ఐతే తన ప్రియురాలికి మరొకరితో పెళ్ళి జరిగిందన్న వార్త తెలుసుకున్న మురళీ మోహన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని‌ ప్రాణాలను వదిలాడు. ఇంట్లో విగతజీవిలా ఫ్యాన్ కు వేలాడుతున్న కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి‌పర్యాంతం అయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Published at : 08 Jun 2023 10:13 PM (IST) Tags: Tirupati News Suicide Chandragiri news Marriage

ఇవి కూడా చూడండి

Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!

Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!

Medipally: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్‌ ట్రైనర్‌-పోక్సో కేసు నమోదు

Medipally: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్‌ ట్రైనర్‌-పోక్సో కేసు నమోదు

Tirupati Boy Kidnap: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ - సీసీ ఫుటేజ్‌లో కీలక విషయాలు

Tirupati Boy Kidnap: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ - సీసీ ఫుటేజ్‌లో కీలక విషయాలు

UKG Student Died: పలకతో కొట్టిన టీచర్, యూకేజీ విద్యార్థి మృతి

UKG Student Died: పలకతో కొట్టిన టీచర్, యూకేజీ విద్యార్థి మృతి

UP News: వీళ్లు రక్షకభటులా! జంటను బెదిరించి యువతికి పోలీసుల లైంగిక వేధింపులు

UP News: వీళ్లు రక్షకభటులా! జంటను బెదిరించి యువతికి పోలీసుల లైంగిక వేధింపులు

టాప్ స్టోరీస్

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌