By: ABP Desam | Updated at : 14 Apr 2022 09:27 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీపీఐ నారాయణ సతీమణి వసుమతిదేవి(ఫైల్ ఫొటో)
CPI Narayana : సీపీఐ నేత నారాయణకు సతీమణి వసుమతిదేవి(65)కన్నుమూశారు. అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె కన్నుమూశారు. రేపు(శుక్రవారం) నగరి మండలం ఐనంబాకంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలోని ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగుతాయని సీపీఐ నేతలు తెలిపారు.
ప్రముఖుల సంతాపం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీపీఐ నారాయణ సతీమణి వసుమతిదేవి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. విద్యార్థిగా ఎఐఎస్ ఎఫ్‌లో పని చేసి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా ఆమె పనిచేశారు. తరువాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని కమ్యూనిస్టు పార్టీలో వసుమతిదేవీ పనిచేశారు. ప్రజా సహాకారంతో ప్రారంభించిన 99 టీవీ ఏర్పాటులో ఆమె క్రియాశీల పాత్ర పోషించారని గుర్తుచేశారు. కామ్రేడ్ వసుమతి మృతి పట్ల నారాయణ, వారి కుటుంబ సభ్యులకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ గారి సతీమణి శ్రీమతి వసుమతి గారు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.— B Vinod Kumar (@vinodboianpalli) April 14, 2022
Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!
Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ