Viral News: తమిళనాడులో పదోతరగతి విద్యార్థుల దారుణం- పూర్తి వివరాలు తెలిస్తే నరాలు కట్ అయిపోతాయి
ముగ్గురు పదోతరగతి విద్యార్థులపై తమిళనాడు పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. వాళ్లను అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.
ఎవరికీ పదిహేనళ్లకు మించి లేవు. అయినా వాళ్లు చేసింది ఇప్పుడు సంచలనమైంది. పదోతరగతి చదువుతున్న ఆ విద్యార్థుల అరెస్టు తమిళనాడు వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసింది.
పదోతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌ను గ్యాంగ్‌రేప్ చేశారు. అక్కడితో ఆగిపోలేదా పిల్లలు. తాము చేసిందేదో ఘనకార్యం అన్నట్టు వీడియో షూట్ చేశారు. దాన్ని స్నేహితులతో పంచుకున్నారు కూడా. వీడియో షేర్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... బాలికను బ్లాక్‌మెయిల్ చేసి ఈ దురాఘతానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. వేరే అబ్బాయితో బాధితురాలికి రిలేషన్ ఉందని చెప్పారు పోలీసులు. వాళ్లిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేశారు. తాము చెప్పిన చోటుకు రావాలని... ఓ స్నేహితుడి ఇంటికి పిలిచి పాడు పని చేశారు.
ఈ మధ్య కాలంలో బాధితురాలు తన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లింది. అదే పార్టీకి వచ్చిన నిందితుల్లో ఒకడు ఫొటోలు తీశాడు. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు సీక్రెట్‌గా ఫొటోలు తీశాడు. వాటిని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగారు.
తాము చెప్పినట్టు చేయకుంటే ఈ ఫొటోలు ఆమె పేరెంట్స్‌కు, ఇతర ఫ్రెండ్స్‌కు చూపిస్తామన్నారు. స్కూల్ పక్కనే ఉన్న తన ఇంటికి రావాలని బలవంతం చేశాడు. వాళ్ల బెదిరింపులకు భయపడిపోయిన బాధితురాలు.. తల్లిదండ్రులకు తెలిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిసి... ఫొటోలు ఇస్తానంటే.. నిందితుడి ఇంటికి వెళ్లేందుకు ఓకే చెప్పింది.
ఈ నెల ప్రారంభంలో లంచ్‌బ్రేక్‌లో స్కూల్ పక్కనే ఉన్న నిందితుడి ఇంటికి వెళ్లింది బాలిక. ఆమె వెళ్లే సరికి అక్కడ ముగ్గురు ఉన్నారు. వాళ్లంతా ఆమెను బలత్కారం చేశారు. వారిలో ఒకడు దాన్ని వీడియో తీశాడు. తర్వాత దాన్ని ఫ్రెండ్స్‌కు షేర్ చేశారు.
ముగ్గురు మాత్రమే ఆమెను రేప్ చేశారు. మరో వ్యక్తి ఆమె వెంటపడుతూ ఇబ్బంది పెట్టాడు. గతంలో ఆ వ్యక్తితో ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడు. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఈ సంఘటన అందరిలో గుబులు రేపింది. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించామని మెడికల్ రిపోర్టు రాగానే తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు పోలీసులు..
Also Read: భాగ్యనగరంలో భారీ మోసం, దూది ఇచ్చి కోట్లు దోచేశారు!
Also Read: ఎమ్మెల్సీకే రూ. కోట్లలో టోకరా - ఈ కుర్రాడు మామూలోడు కాదు !
Also Read: ఫ్రాంక్ వీడియోస్ పేరుతో పిచ్చి వేషాలు, తిక్క కుదిర్చిన పోలీసులు!