అన్వేషించండి

Hyderabad News : భాగ్యనగరంలో భారీ మోసం, దూది ఇచ్చి కోట్లు దోచేశారు!

Hyderabad News : హైదరాబాద్ లో వత్తుల పేరిట భారీ మోసం చేసిందో సంస్థ. సుమారు 600 మంది వద్ద రూ.20 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారు.

Hyderabad News : హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వత్తుల తయారీ పేరుతో ఓ సంస్థ డిపాజిట్ దారులను నిట్టనిలువునా ముంచింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే అత్యాశను ఆసరాగా చేసుకున్న ఓ సంస్థ డిపాజిట్ల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. హైదరాబాద్‌ బోడుప్పల్‌లో మరో భారీ మోసం బట్టబయలైంది. దూది వత్తుల తయారీ పేరిట ఏబీజీ అనే సంస్థ పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించింది. వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షలు సేకరించారు. 

రూ.20 కోట్ల మేర మోసం! 

కిలో దూదికి రూ.300 చెల్లించి తీసుకుని వత్తులు తయారు చేసి ఇస్తే రూ.600 చెల్లిస్తామని నమ్మించారు. ఆరు నెలల తర్వాత చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు తిరిగి వస్తుందని నమ్మిన బాధితులు పెద్దఎత్తున డిపాజిట్లు కట్టారు. రెండు నెలల సజావుగా డబ్బు చెల్లించిన సంస్థ తర్వాత పత్తాలేకుండా పోయారు. దీంతో బాధితులు ఏబీజీ కంపెనీ యజమాని బాలస్వామి గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 600 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు విచారణ తెలిపింది. రూ.20 కోట్ల మేర నిర్వాహకులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏబీజీ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వత్తుల మిషన్లు అంటగట్టి

ఇటీవల కరక్కాయ పొడి పేరిట ఓ గ్యాంగ్ భారీగా డిపాజిట్లు సేకరించి ముంచేసింది. తాజాగా వత్తుల మిషన్ పేరిట మరో సంస్థ మోసానికి పాల్పడింది. వత్తుల మిషన్లను బాధితులకు అంటగట్టి వారి నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆ వత్తులు మళ్లీ తమకే అమ్మాలని నమ్మించారు. మొదట రెండు, మూడు నెలలు డబ్బులు సజావుగానే ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఈ వత్తుల మిషన్ ద్వారా నెలకు రూ.30 నుంచి 50 వేలు సంపాదించవచ్చని బాధితులను నమ్మించారు. ఇందుకోసం యూట్యూబ్ లో బాలా స్వామిగౌడ్ వీడియోలు కూడా అప్లోడ్ చేశారని బాధితులు చెబుతున్నారు. ఒక్కో మిషన్ రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు. మిషన్ తో పాటు ఒక్కొక్కరికీ 50 నుంచి 100 కేజీల దూది కూడా ఇచ్చారని చెబుతున్నారు. వత్తులు మళ్లీ బాలాస్వామి గౌడ్ కొంటామని చెప్పడంతో బాధితులు పూర్తిగా నమ్మారు. చాలా మంది మిషన్లు కొని వత్తులు చేయడం మొదలుపెట్టారు. ఒకరిద్దరికి డబ్బులు రావడంతో మరికొంత మంది మిషన్లకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. గత కొంతకాలంగా వత్తులు కొనడానికి రాకపోవడం, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు మిషన్లు ఇవ్వకపోవడంతో బాధితులు అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే సదరు సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది. దిక్కులేదు.. అడ్వాన్స్ డబ్బులిచ్చినోళ్లకు మిషన్ల లేవు. ఫోన్లు చేస్తే అప్పుడిస్తామని..ఇప్పుడిస్తామంటూ సాగదీస్తున్నారని ఆరోపించారు. దీంతో మోస పోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 800 మంది బాధితులు  మోస పోయినట్టు తెలుస్తోంది. దీంతో లబోదిబోమని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget