Guntur Crime News : ఎమ్మెల్సీకే రూ. కోట్లలో టోకరా - ఈ కుర్రాడు మామూలోడు కాదు !
డీఆర్‌డీవో యువ శాస్త్రవేత్తనంటూ ఓ ఎమ్మెల్సీని కోట్లలో మోసంచేసిన యువకుడిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఎమ్మెల్సీ ఎవరు అన్నది బయటకు రావడం లేదు.
Guntur Crime News : అతనికి పట్టుమని పాతికేళ్లు ఉంటాయి. కానీ రెండు, మూడు ఖరీదైన కార్ల కాన్వాయ్‌గా తిరుగుతాడు. గన్‌మెన్లు ఉంటారు. ఖరీదైన ఇల్లు కూడా ఉంది. పటాటోపం చూపిస్తున్న అతనెవరు ? రాజకీయ నాయకుడా ? కానే కాదు. మరెవరు.. ఓ మోసగాడు అంతే. ఆ మోసగాడి వలలో ఎమ్మెల్సీ పడ్డాడు. ఆయన నుంచి పిండుకోవాల్సినంత పిండుకున్నాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ తన డబ్బుల కోసం సీఐడీ కేసు పెట్టాడు. దాంతో సీఐడీ పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో గల్ఫ్ గోసలు, తండ్రి మృతదేహం కోసం 108 రోజుల పాటు పడిగాపులు కాసిన కుటుంబం!
ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడేనికి చెందిన బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్ గతంలో తిరుపతిలో చదువుకున్నారు. తర్వాత గుంటూరుకు వచ్చేసిఎంటెక్ ఎలక్ర్టానిక్స్ చదివానని డీఆర్‌డీవోలో యువ శాస్త్రవేత్తనంటూ తిరగడం ప్రారంభించారు. ఖరీదైన కార్లు కొని గన్‌మెన్లను పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇద్దరు గన్‌మెన్, ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు అనుచరులను వెంటబెట్టుకుని రెండు ఖరీదైన కార్లలో తిరిగేవాడు. కారుపై పెద్ద అక్షరాలతో ‘డీఆర్‌డీవో యువ శాస్త్రవేత్త’ అని రాయించుకున్నాడు. స్వగ్రామంలో రూ.కోటికి పైగా వెచ్చించి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు.
ఫ్రాంక్ వీడియోస్ పేరుతో పిచ్చి వేషాలు, తిక్క కుదిర్చిన పోలీసులు!
అయితే ఎప్పుడూ ఉద్యోగానికి వెళ్లినట్లుగా ఉండేవాడు కాదు. కానీ ఆయన వేష,భాషలు చూసి అనేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై యువతకు ఉపన్యాసం ఇచ్చేవాడు. సేవా కార్యక్రమాల పేరుతో బియ్యం పంపిణీ వంటివి చేపట్టాడు. అయితే ఆయన వ్యవహారంపై పెద్దగా ఫిర్యాదులేం రాలేదు. కానీ తిరుపతిలో చాలా ఘనకార్యాలు చేశాడని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకునేదాకా ఎవరికీ తెలియలేదు.
రెండురోజుల క్రితం సీఐడీ అధికారులు ఇంటిపై దాడి చేసి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీని రూ.కోట్లలో ముంచినట్టు సీఐడీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్సీని ఏవిధంగా మోసం చేశాడు? ఎంత మొత్తంలో నొక్కేశాడు? అన్న విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. మామూలుగా అయితో సీఐడీ ఇలాంటి కేసుల్ని టేకప్ చేయదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ నేరుగా సీఐడీ రంగంలోకి దిగడంతో ఎమ్మెల్సీ తన సొమ్ములు తిరిగి వస్తాయని అనుకుంటారు. ఆ ఎమ్మెల్సీ ఎవరనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.