Peddapalli Crime: ప్రేమించకపోవడమే నేరం... ప్రేమోన్మాది ఘాతుకం... గొంతు కోసి హత్య
పెద్దపల్లి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో యువతిపై కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు.
ప్రేమించానని వెంట పడి ఒప్పుకోకపోతే ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పూటకో చోట అమ్మాయిలపై వేధింపులు బయటపడుతున్నాయి. ప్రేమ పేరుతో యువతులను వేధించడం ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. తన ప్రేమను కాదన్నారన్న ఒక్క సాకుతో విచక్షణ మరించి అమాయకులైన అమ్మాయిల ప్రాణాలు తీస్తున్నారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆవేశాలతో నిండు జీవితాల్ని జైలు పాలు చేసుకుంటున్నారు.
ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమ పేరుతో ఉన్మాదుల్లా మారి యువతులపై మారణాయుధాలతో దాడులు చేస్తున్నారు కిరాతకులు. ఇలాంటి దారుణ ఘటన తెలంగాణలో జరిగింది. పెద్దపల్లి జిల్లాలో రాజు అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందని కోపంతో యువతిని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. 8వ ఎంక్లేన్ కేకే నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ప్రేమించమని యువతి వెంటపడుతున్నాడు రాజు. అతడి ప్రేమను యువతి అంగీకరించలేదు. దీంతో ఆ యువతిపై కోపంతో ప్రేమోన్మాది రాజు కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా బోరున విలపించారు. తమ బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని వదిలిపెట్టవద్దని పోలీసుల్ని వేడుకున్నారు. ఈ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. హత్య చేసిన అనంతరం ప్రేమ్మోనాది రాజు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Also Read: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?
చిన్న గొడవ చాకుతో హత్య
దంపతుల మధ్య చిన్నపాటి విషయంపై వచ్చిన హత్యకు దారితీసింది. మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన భార్య భర్తను కత్తితో పొడిచి హత్యచేసింది. హైదరాబాద్ సరూర్‌నగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాకు బుసిరెడ్డిగూడ గ్రామానికి చెందిన బుసిరెడ్డి మురళీధర్‌రెడ్డి(42), మౌనిక(25) దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్ కు వలస వచ్చి సరూర్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఇద్దరూ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల 5న మౌనిక గుంటూరుకు వెళ్లింది. తిరిగి 6వ తేదీన ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లో లేని సమయంలో ఆమెపై భర్త మురళీధర్‌రెడ్డి తప్పుగా ప్రచారం చేశాడని కుమారుడు తల్లికి ఫిర్యాదు చేశాడు. దీంతో కోపంతో భర్తతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మౌనిక ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో భర్త మెడపై పొడిచింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది.
Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్