Drug tests: తెలంగాణలో ఈగల్ సంచలన నిర్ణయం - అన్ని విద్యాసంస్థల్లో డ్రగ్ టెస్టులు
Drug tests educational institutions: తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు ఈగల్ డిపార్ట్‌మెంట్ సిద్ధమవుతోంది. మెడిసిటీ మెడికల్ కాలేజీతో సహా వివిధ ప్రాంతాల్లో 84 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించారు.

Eagle Drug tests in all educational institutions: తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీతో పాటు వివిధ విద్యాసంస్థల వద్ద నిర్వహించిన ఆపరేషన్‌లో 84 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించారు. వీరిలో 26 మంది మెడికోలు. ఈ ఆపరేషన్‌లో EAGLE స్థానిక గంజాయి పెడ్లర్ , ఒక ఇంటర్‌స్టేట్ సరఫరాదారుని పట్టుకుని, 6 కిలోల గంజాయిని (విలువ రూ. 1.5 లక్షలు) స్వాధీనం చేసుకుంది. మెడిసిటీ మెడికల్ కాలేజీ నుంచి 8 మంది విద్యార్థులు గంజాయి వినియోగంలో పాజిటివ్‌గా తేలారు. UPI లావాదేవీల ద్వారా 32 మంది వినియోగదారులను గుర్తించారు. వీరిలో 9 మంది డ్రగ్ టెస్టులలో పాజిటివ్‌గా తేలారు. ఈ 9 మందిలో 8 మంది మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు.
#Hyderabad— Medicity Medical College drug bust-
— @Coreena Enet Suares (@CoreenaSuares2) August 7, 2025
32 customers ( medicos) were identified through UPI transaction.
9 tested positive for drugs ( all hoteliers). All have been sent to rehabilitation. pic.twitter.com/6D375Jxg1L
కాలేజీల్లో గంజాయి వినియోగం పెరుగుతోందన్న ఆరోపణలతో EAGLE తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్ టెస్టులను నిర్వహించాలని ప్రణాళిక వేస్తోంది. గతంలో సింబయోసిస్ కాలేజ్, ఒస్మానియా మెడికల్ కాలేజ్, గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్, చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) వంటి సంస్థలలో విద్యార్థులు గంజాయి వినియోగిస్తూ పట్టుబడ్డారు. EAGLE విద్యా సంస్థల నిర్వాహకులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమీపంలోని కిరాణా దుకాణాలలో గంజాయి చాక్లెట్ల విక్రయం వంటి అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే కోరింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 26, 2025న ఇంటర్నేషనల్ డే అగైన్‌స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా రాష్ట్రాన్ని డ్రగ్-ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లలో డ్రగ్ వినియోగం జరిగితే బాధ్యత వహించాలని, సమీపంలోని దుకాణాల్లో గంజాయి చాక్లెట్ల వంటివి విక్రయిస్తే పోలీసులకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు డ్రగ్-సంబంధిత సమస్యలను నివేదించడానికి EAGLE టోల్-ఫ్రీ నంబర్ 1908ను ఉపయోగించాలని ఆయన సూచించారు.
Alert ‼️ EAGLE to conduct Drug tests at all Educational institutions across #Telangana
— Naveena (@TheNaveena) August 7, 2025
26 Medicos among 84 drug consumers identified in #Hyderabad
EAGLE busted a local peddler and an interstate supplier, seizing 6 kg ganja worth Rs. 1.5L.
Medico students from Mediciti found… pic.twitter.com/r4kD215sA8
మెడికల్ విద్యార్థుల డ్రగ్ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నీ తెలిసిన మెడికల్ కాలేజీ విద్యార్థులే ఇలా ఉంటే మిగతా వారి సంగతేమిటన్న ప్రశ్నవస్తోంది. అందుకే అన్ని విద్యా సంస్థలపై దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.





















