అన్వేషించండి

Srikakulam Kidnap : పలాస కాశీబుగ్గలో యువతి కిడ్నాప్ కలకలం, చున్నీతో కట్టేసి హుదుద్ ఇళ్లలో బంధించిన యువకుడు

Srikakulam Kidnap : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. యువతిని చున్నీతో కట్టి నిర్మాణంలో ఉన్న ఇంటిలో బంధించారు.

Srikakulam Kidnap : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వాణిజ్య కేంద్రంలో ఓ యువతి కిడ్నాప్ యత్నానికి గురైన ఘటన కలకలం రేపింది. సూది కొండ నుంచి హుదుద్ గృహాల ప్రాంతానికి యువతిని బలవంతంగా తీసుకెళ్లి దాదాపు ఆరుగంటలపాటు బంధించారు. కుటుంబసభ్యులు స్థానికులు యువతి కోసం వెతగ్గా చివరకు చున్నీతో బంధించిన వైనాన్ని  గుర్తించి సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో అలజడి రేపుతుంది. సూదికొండకు సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో  ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడు థియేటర్ అడ్రసు అడగగా ఆమె చెప్పెలోపే చున్నీతో కట్టి బలవంతంగా పట్టుకుపోయారని బాధితరాలు చెబుతుంది. కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో పాడుపడిన భవనాలు చూసి ఆశ్చర్యపోయారు. అసలు కిడ్నాప్ కు యత్నించిన వారేవరై ఉంటారనేది అంతు చిక్కడంలేదు. హిందీ , తెలుగు భాషలో మాట్లాడుకున్నారని చెప్పడంతో పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయికి ఎటువంటి హాని కలుగకుండా బయటపపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమౌదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 
 

వరంగల్ లో బాలిక కిడ్నాప్ 

 వరంగల్ లో  బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్ లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏస్ లో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై  బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.   

"దుకాణానికి వెళ్లిన చిన్నారిని ముగ్గురు వ్యాన్ లో వచ్చి కిడ్నాప్ చేశారు. ఛాయ్ తాగేందుకు ఆగినప్పుడు బాలికకు మెళకువ వచ్చింది. చిన్నారి వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పట్టుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ఆమె వెంటబడ్డారు. అయితే అక్కడున్న వాళ్లు ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చెప్పడంతో ఆ ముగ్గురు అక్కడ నుంచి పారిపోయారు. ముఖానికి కర్ఛీఫ్ తో ముగ్గురు వచ్చారని అమ్మాయి చెబుతోంది." - చిన్నారి బంధువు

"పాప షాపునకు వెళ్లింది. అమ్మాయి రోడ్డు దాటేవరకూ అక్కడే నిలబడ్డాను.  పది నిమిషాలు అయినా ఇంకా పాప రాలేదు. మా అబ్బాయిని పంపి షాపు వద్ద అడిగితే ఎవరు రాలేదని చెప్పారు. ఈ విషయాన్ని నా భర్తకు చెప్పాను. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని అక్కడ కూడా చూశాం, కానీ అక్కడికీ వెళ్లలేదు. ఇంతలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పాప వరంగల్ లో ఉందని ఫోన్ వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందని అడిగితే ఎవరో వ్యాన్ లో తీసుకొచ్చారని బాలిక చెప్పింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశాం. "- బాలిక తల్లి 
 

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget