Constable: విశాఖలో విషాదం - తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Andhrapradesh News: విశాఖ ఐవోబీ బ్యాంకులో గన్ మెన్ గా ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం విధుల్లోకి వచ్చిన ఆయన తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు.
Constable Suicide in Visakhapatnam: విశాఖపట్నంలో (Visakhapatnam) గురువారం ఉదయం తీవ్ర విషాదం జరిగింది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఐవోబీ బ్యాంకులో గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యారు. అనంతరం తన వద్ద ఉన్న ఎల్ఎల్ఆర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు శంకర్రావు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సమస్యలా.? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా.? అనే దానిపై విచారిస్తున్నారు.
Also Read: Kurnool News: కర్నూలు జిల్లాలో దారుణం- 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్