Crime News: ఒక్కడేనా.. స్నేహితుల సహకారం ఉందా? చాలా మంది మహిళలను ట్రాప్ చేసిన శరత్
Andhra Pradesh News | శ్రీకాకుళం జిల్లాల స్థానిక న్యూకాలనీలోని ఓ ఇంటిలో శవమై కనిపించిన వివాహిత కళావతి హత్యకేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

Srikakulam News | శ్రీకాకుళం జిల్లాల ప్రధాన నిందితుడు శరత్ను సోమవారం ఉదయం పోలీసులు అదు పులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కళాను తానే హత్యచేశానని, బంగారం కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచార ణలో శరత్ అంగీకరించాడట. అయితే శరత్తోపాటు అతడితో సన్ని హితంగా ఉంటున్న మరికొందరు మిత్రుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలి కాలంలో శరత్తోపాటు తిరుగుతున్న పలువురు యువకులను స్టేష నక్కు పిలిచి విచారించినట్లు తెలిసింది. నిందితుడి కాల్ డేటా ఆధా రంగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది.
మహిళల్ని ట్రాప్ చేస్తున్న శరత్
శరత్ కాల్ డేటాలో చాలామంది మహిళల పేర్లు ఉన్నాయి. ఘటన జరగక ముందు, తరువాత కూడా వారితో శరత్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్ట్స్ కళాశాల వెనుక ప్రాంతానికి చెందిన ఓ వివాహితను ఆదివారం రాత్రి పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి విచారించి వది లేశారు. సోమవారం సాయంత్రం శరత్‌తో మాట్లాడుతున్న మరికొందరు మహిళలను విచారణ నిమిత్తం స్టేషన్కు పిలిచి వివరాలు సేకరించారు. కొందరు మహిళలను శరత్ ట్రాప్ చేసి వారి వద్ద బం గారం, సొమ్మును తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను ట్రాప్ చేసి వాడుకోవడం అతడికి సర్వసాధారణమైందని పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. చెడు వ్యసనాలకు శరత్ బానిసవ్వడంవల్లే ఇదంతా జరిగిందన్న చర్చ నడుస్తోంది. మరింత లోతుగా విచారణ జరిపి హత్య వెనుక అతడి స్నేహితుల సహకారం ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అరెస్టు చూపించాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయట,
కళావతి కాకపోతే కన్నతండ్రే హతమొందించడానికి సన్నద్ధమవుతున్నాడని అండులూరి శరత్‌కుమార్ పూజారి కళావతిని హత్య చేయకపోయినా తన కన్నతండ్రిని మాత్రం అంతమొందించడానికి కొన్ని రోజులుగా సన్నద్ధమవుతున్నాడని సమాచారం. కోట్ల ఆస్తి ఉన్నా ఒక్కగానొక్క కొడుకైన తనను తండ్రి బయటకు పంపించేశాడని, ఆ ఇంటిలో ఉంటున్నవారందర్నీ హత్య చేయాలంటూ గంజాయి, మందు కొడుతున్న ప్రతిసారీ శరత్‌కుమార్ తన బ్యాచ్ వద్ద కేకలు వేసేవాడని చెప్పుకుంటున్నారు. గంజాయి బాగా తలకెక్కేయడంతో పిచ్చి ప్రేలాపనలే తప్ప సొంత కుటుంబీకుల్ని ఏం చేస్తాడులే అని వీరు లైట్ తీసుకున్నట్టు చెబుతున్నారు.
డబ్బు అవసరమయ్యే హత్య చేశాడా?
శనివారం కూడా బంగారంతో వచ్చిన కళావతిని కేవలం గంజాయి, మందు జల్సాలకు డబ్బు అవసరమయ్యే హతమొందించాడని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. మృతురాలి చేతికి ఉన్న రెండు గాజులను స్థానిక బంగారం కొట్ల సందులో ఒకరికి అమ్మేసి ఆ సొమ్ముతోనే రూ.40వేలు తన మిత్రుడికి శరత్ అప్పు తీర్చాడు. మరో రూ.2లక్షలు ఇస్తానని, హత్య కేసు నుంచి తప్పుకోడానికి తనకు సహకరించాలని ఒక మిత్రుడ్ని కోరడం, ఆయన అక్కడికక్కడే శరత్‌ను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించడం వరకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే విచారిస్తున్న పోలీసులు గాజులను రికవరీ చేయగా, తనకు తీర్చిన రూ.40వేల అప్పును శరత్ మిత్రుడే పోలీసులకు తిరిగి ఇచ్చేశాడు. మృతురాలి చెవికి ఉండాల్సిన దుద్దులు ఘటన జరిగిన ఇంట్లోనే మిద్దె మీద పెట్టినట్లు ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి బంగారాన్ని అమ్మి కొంతమేరకు బకాయిలు తీర్చి మిగతాది జల్సాలకు వాడుకోవడం కోసమే వివాహితను హత్య చేశాడని తెలుస్తుంది.
శరత్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారు..
శరత్ కి డబ్బులు ఎక్కువగా ఉన్నాయని ఫ్రెండ్స్ చాలా వరకు శరత్ తో తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు అయితే శరత్ ఏం చేసినా దానికి కొంతమంది సై అంటే సై అనేవారు. శరత్ ఎలాంటి పని చేసిన ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఎంతో ఆదరణంగా ఉండేవారు అయితే ఇప్పుడు ఈ ఘటనతో కొంతమంది ఫ్రెండ్స్ పరారయ్యారని మరి కొంత మంది ఆ టైంలో లేము మాకు తెలియదు అని చెప్పడం పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో మరి కొత్త విషయాలు బయటపడటంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఉలిక్కిపడుతున్నారు. శరత్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కూడా షాక్ గురయ్యే విషయాలు చెప్పేసరికి అందరికీ దిమ్మతిరిగిపోయింది అని కూడా చెప్తున్నారు. బాగా గంజాయి తాగుతూ అక్రమ సంబంధాలు అందరికీ ఉన్నాయని ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. కళావతి మడర్ తర్వాత మరిన్ని విషయాలు బయటకు రావడంతో శరత్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఒక్కొక్కరిగా స్టేషన్ బాట పట్టారు అయితే పోలీసులు కూడా తనదైన సైలులో మాత్రమే విచారణ. చేపడుతున్నారు






















