Seven Hills Express Train: అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం - సిగ్నల్ కట్ చేసి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ
Robbery in Seven Hills Express Train: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రొటీన్‌కు భిన్నంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో కాకుండా ఏకంగా రైలులో చొరబడి దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది.
Mid Night Robbery in Seven Hills Express Train From Tirupati To Secunderabad : తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్లో గుర్తుతెలియని దుండగులు బీభత్సం చేశారు. రైల్వే సిగ్నల్ కట్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలును ఆపి 9 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు డోన్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదులు బాధితులు ఫిర్యాదు చేశారు.
అర్ధరాత్రి దొంగలు బీభత్సం
అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రొటీన్‌కు భిన్నంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో కాకుండా ఏకంగా Seven Hills Express Trainలో చొరబడి దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. సెవెన్ హిల్స్ రైలు వెళ్తుండగా సిగ్నల్ వైర్ కట్ చేసిన కొందరు గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుత్తి సమీపంలోని తురక పల్లి గ్రామం వద్ద రైలులోకి చొరబడ్డ దుండగులు ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, నగదు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అర్ధరాత్రి 1:30 ఈ సంఘటన జరగడం జిల్లాలో కలకలం రేపింది. వేసవికాలంలో దోపిడీలు జరుగుతాయని పోలీసులకు అంచనా ఉన్నప్పటికీ ముందస్తు నిఘా పెట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. బాధితులు కర్నూలు జిల్లా డోన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైలులోని బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం సిగ్నల్ కట్ చేసి రైలును ఆపిన కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో తిరుపతి నుంచి సికింద్రాబాదు వెళుతున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలు సిగ్నల్ లేకపోవడంతో స్టేషన్ దాటిన తరువాత ఆగింది.
రైలు ఆపగానే చోరబడ్డ దుండగులు..
లోకో పైలెట్ రైలును ఆపిన వెంటనే దుండగులు బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి నగదు, బంగారు నగలు లాక్కు న్నారు. మారణాయుధాలను చూపి ప్రయాణికులను దోచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తంలో దోపిడీ జరిగిందో తెలియరాలేదు. 9 తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్లు ప్రాథమిక సమాచారం. బాధితుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వడంతో రైలు కదిలింది. గతంలో ఇలాంటి తరహా ఘటనలు ఏమైనా జరిగాయా, అలాంటి కేసుల్లో దోషులు ఎవరనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలు చల్లచల్లగా - నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు
Also Read: Gold Rate Today: వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ !