By: ABP Desam | Updated at : 09 Apr 2022 07:31 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్‌డేట్స్ (Representational Image)
Light rain predicted at isolated places Andhra Pradesh and Telangana: ఎండలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలగనుంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవికాలంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వర్షాలతో మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగిరానున్నాయి. తెలంగాణలో చల్లని గాలులు వీచడంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం చల్లగా మారిపోయింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఊరట లభిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు)లో నేడు వర్షాలుంటాయి. మారేడుమిల్లి - రంపచోడవరం ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. మరోవైపు నల్లమల బెల్ట్ నందికొట్కూరు-నంద్యాల కొండ ప్రాంతంలో సాయంకాలం ఓ మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు దిగిరానున్నాయి.
Fisherman warnings for Andhra Pradesh dated 08.04.2022 pic.twitter.com/OD9SVrr11V
— MC Amaravati (@AmaravatiMc) April 8, 2022
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తగ్గనున్నాయి. అకాల వర్షాల ప్రభావంతో రాయలసీమ కాస్త చల్లగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వచ్చాయి. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరగవని, చల్లని గాలులు వీస్తాయని అంచనా వేశారు. ప్రతిరోజూ దాదాపు 5 లీటర్ల వరకు నీళ్లు తాగాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
వేడి వల్ల భారీ ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో వర్షాలు పడటం చాలా సహజం. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల ప్రభావం తగ్గింది.
Also Read: Gold Rate Today: వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ !
Also Read: Kurnool News : పుట్టిన అరగంటలోనే, ఆడ బిడ్డను ఆసుపత్రిలో వదిలివెళ్లిపోయిన తల్లి
Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి