Gold Rate Today: వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ !
Gold Price In Hyderabad: వరుసగా రెండో రోజు బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం ధర రూ.260 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,630 అయింది.
Gold Rate Today 9th April 2022: మార్చి 9వ తేదీన జీవితకాల గరిష్టానికి చేరుకున్న బంగారం వెండి ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. గత నెలతో పోల్చి చూస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత నెలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం ధర రూ.260 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,630 అయింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర రూ.300 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.71,300 కు ఎగబాకింది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.250 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 9th April 2022) 10 గ్రాముల ధర రూ.52,630 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,300 అయింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.260 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250 కు చేరింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.300 పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.71,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,630 కి పెరిగింది.
చెన్నైలో రూ.230 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,820 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,260 కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,630 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్లాటినం ధర
హైదరాబాద్‌లో రూ.23 మేర పుంజుకోవడంతో చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,440కి పెరిగింది.
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.23,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో 23 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.24,440 కి చేరింది.
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,440 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Kia EV6 GT: రోడ్డుపై కనిపించిన కియా మొదటి ఎలక్ట్రిక్ కారు - లుక్ అదిరిందిగా - ఫీచర్లు కూడా సూపర్!