search
×

Cardless Cash Withdrawal: కార్డుల్లేకుండానే బ్యాంకులు, ఏటీఎంల్లో క్యాష్‌ విత్‌డ్రా! UPI ఐడీతో అద్భుతాలు!

Cardless Cash Withdrawal: దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో కార్డులెస్‌ విత్‌డ్రావల్‌ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (RBI MPC) సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shastikanta das) ఈ ప్రతిపాదన చేశారు.

FOLLOW US: 

ఇండియా ఎకానమీ (India Economy) మరింత వేగంగా డిజిటలైజ్‌ అవుతోంది! ఇప్పటికే యూపీఐ లావాదేవీలు (UPI Transactions) రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. విదేశాలకూ ఈ సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో కార్డులెస్‌ విత్‌డ్రావల్‌ (Cardless withdrwal facility in atms) సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఇకపై డెబిట్‌ (Debit card), క్రెడిట్‌ కార్డులు (Credit card) లేకుండానే నేరుగా ఏటీఎం యంత్రాల (ATMs) నుంచి డబ్బు తీసుకోవచ్చు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (RBI MPC) సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shastikanta das) ఈ ప్రతిపాదన చేశారు.

ప్రస్తుతం కొన్ని ఏటీఎంలలో మాత్రమే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకొనే సౌకర్యం ఉంది. ఇప్పుడు దీనిని అన్ని ఏటీఎంలకు విస్తరించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. సూపర్ హిట్టైన యూపీఐ ఐడీ ఉపయోగించుకొనే ఈ సేవలు వినియోగించుకోవచ్చు. కరోనా సమయంలో ముట్టుకోకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకొనే సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఏటీఎంలలో యూపీఐ సౌకర్యం వల్ల డెబిట్‌, క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ను అడ్డుకోవచ్చు. కార్డు స్కాములు జరగకుండా చూడొచ్చు. త్వరలోనే కార్డు రహిత నగదు ఉపసంహరణ సేవలు అందించేందుకు ఎన్‌పీసీఐ, ఏటీఎం నెట్‌వర్క్‌, బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు ఇవ్వనుంది.

ప్రస్తుతం కార్డు రహిత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయంటే?

* ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను ఉపయోగించుకొని ఇండియాలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు డబ్బును కార్డు లేకుండానే పంపుకోవచ్చు.
*  డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేకుండా యూజర్‌ నగదును ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.
*  నగదు బదిలీ చేయాలంటే మాత్రం పేయీ మొబైల్‌ నంబర్‌ అవసరం.
*  మొబైల్‌ నంబర్‌తో పాటు నాలుగు, ఆరు అంకెల వెరిఫికేషన్‌ కోడ్స్‌ ఎంటర్‌ చేయాలి.
*  రోజుకు రూ.100 నుంచి రూ.10,000 వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక నెల మొత్తానికి రూ.25,000 మాత్రమే విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఇస్తున్నారు.

శక్తికాంత దాస్‌ ఏం చెప్పారంటే?

RBI Monetary Policy MPC Repo Rate Unchanged RBI Governor Shaktikanta Das: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. రెపో రేటును (Repo rate) 4 శాతం, రివర్స్‌ రెపోరేటును (Reverse repo rate) 3.35 శాతం ఉంచింది. కీలక రేట్లలో మార్పులు చేయకూడదని ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta das) మీడియాకు తెలిపారు.

2022-23కు ద్రవ్యోల్బణం రేను 5.7 శాతంగా ఎంపీసీ అంచనా వేసింది. అంతకు ముందున్న అంచనా రేటు 4.5 శాతాన్ని సవరించింది. గతంలో 7.8 శాతంగా అంచనా వేసిన భారత జీడీపీ (GDP) వృద్ధిరేటును 2023గాను 7.2 శాతానికి తగ్గించింది. 2022, ఏప్రిల్‌ 1 నాటికి ఫారెక్స్‌ నిల్వలు 606.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. 2021-22లో ఇండియా ఎగుమతులు వేగంగా పెరిగాయని పేర్కొన్నారు. 400 బిలియన్‌ డాలర్లుగా పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించాయని వెల్లడించారు.

Published at : 08 Apr 2022 05:09 PM (IST) Tags: Credit Card monetary policy repo rate Debit card UPI ATMs RBI MPC governor Shaktikanta Das Cardless cash withdrawal

సంబంధిత కథనాలు

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Bitcoin: ప్రభుత్వాల వద్దే ఇన్ని బిట్‌కాయిన్‌లు ఉన్నాయా? ఇక టెస్లా వద్దైతే..!

Bitcoin: ప్రభుత్వాల వద్దే ఇన్ని బిట్‌కాయిన్‌లు ఉన్నాయా? ఇక టెస్లా వద్దైతే..!

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Radhakishan Damani: స్టాక్‌ మార్కెట్‌ పతనం - డీమార్ట్‌ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!

Radhakishan Damani: స్టాక్‌ మార్కెట్‌ పతనం - డీమార్ట్‌ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!

Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు

Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!