న్యాయం కోసం భర్త ఇంటిముందు రెండో భార్య ఆందోళన
భర్త చనిపోయిన తర్వాత తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఓ భార్య అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతోంది.
తనకు తన పిల్లలకు న్యాయం కావాలని లత అనే మహిళ న్యాయ పోరాటానికి దిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందలి గాంధీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదే ఊరిలో ఉంటున్న రామ్మూర్తి గౌడ్ విజయలక్ష్మి కుమారుడు విక్రమ్ గౌడ్ తొమ్మిది నెలల క్రితం కరోనా, బ్లాక్ ఫంగస్‌తో అకస్మాత్తుగా చనిపోయాడు. అప్పటి నుంచి గొడవ మొదలయ్యాయి.
విక్రమ్ గౌడ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇక్కడ అసలు సమస్య స్టార్ట్ అయింది. మొదటి భార్య అనురాధకు ముగ్గురు కుమార్తెలు. అయితే కుమారులపై ఆశతో విక్రమ్‌గౌడ్ మరో పెళ్లి చేసుకున్నాడు. 2006లో లత అనే మహిళతో కసాపురం దగ్గర ఉన్న బుగ్గ సంగమేశ్వర స్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలో వివాహాం చేసుకున్నాడు విక్రమ్‌గౌడ్.
రెండో భార్యకు ఇద్దరు కుమారులు పుట్టారు. విక్రమ్ గౌడ్ బతికి ఉన్నంత కాలం అందర్నీ హ్యాపీగా చూసుకున్నాడు. ఎవరికీ ఏ లోటు లేకుంటా అందర్నీ సంతోషంగా ఉంచాడు. లాస్ట్ ఇయర్ విక్రమ్‌గౌడ్ కరోనా బారిన పడ్డాడు. దీనికి తోడు బ్లాక్‌ఫంగస్ ఎటాక్ అయింది. దీంతో తీవ్ర అనారోగ్యంతో విక్రమ్‌గౌడ్ అకస్మాత్తుగా చనిపోయాడు.
విక్రమ్ గౌడ్ అకస్మాత్తుగా చనిపోవడంతో రెండో భార్య ఆమె ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో ఆమె తన అత్తింటి వారిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న విక్రమ్ గౌడ్ కుమార్తెలు తన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని బోరుమంటోంది. తను అన్ని విధాల వేధింపులకు గురిచేస్తున్నారని లత వాపోతోంది.
విక్రమ్‌గౌడ్ మొదటి భార్య కుమార్తెల వేధింపులు తట్టుకోలేక రెండో భార్య న్యాయ పోరాటానికి దిగింది. అత్తారింటి ముందు బైఠాయించింది. న్యాయం చేయాలని ప్లకార్డు పట్టుకొని ధర్నా చేపట్టింది. లత చేస్తున్న న్యాయపోరాటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మద్దతు తెలిపారు. లతకు అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు.
లత పోరాటానికి స్పందించిన ఎమ్మిగనూరు టౌన్ పోలీసులు ఇరువర్గాల వారిని విచారించి చట్టప్రకారం న్యాయం చేస్తామని విక్రమ్ గౌడ్ హామీ ఇచ్చారు. దీంతో లత తన పోరాటాన్ని విరమింపజేశారు.
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం
Also Read: Covid 19 Vaccine: భయపడకండి.. బూస్టర్ డోస్ వచ్చేసింది.. చుక్కల మందుకు డీసీజీఐ అనుమతి!
Also Read: 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి