అన్వేషించండి

Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదైంది. కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ గేరు మార్చింది. దేశంలో మళ్లీ సెకండ్ వేవ్ తరహా పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా 2100 మార్కు దాటింది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కు చేరింది.

Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం

కరోనా, ఒమిక్రాన్ కేసులు రెండింటిలోనూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 653 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,14,004కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.61%గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.01%గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 4.18%గా ఉంది.

మహారాష్ట్ర.. 

మహారాష్ట్రలో కొత్తగా 18,466 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,30,494కు చేరింది. మరణాల సంఖ్య 1,41,573కు పెరిగింది. 

మహారాష్ట్రలో కొత్తగా 75 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు పెరిగింది.

కొత్తగా నమోదైన 75 ఒమిక్రాన్ కేసుల్లో 40 ముంబయిలోనే నమోదయ్యాయి. 9 థానే నగరంలో, 8 పుణెలో, 5 పాన్‌వేల్‌లో, కొల్హాపుర్, నాగ్‌పుర్‌లో చెరో 3 కేసులు నమోదయ్యాయి. ముంబయిలో కొత్తగా 10,606 కరోనా కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (ఎమ్‌ఏఆర్‌డీ) అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం గత 48 గంటల్లో 170 మంది వైద్యులకు పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, భాజపా గుర్‌గావ్‌ ఎమ్మెల్యే విద్యా ఠాకూర్, దక్షిణ ముంబయి ఎంపీ అర్వింద్ సావంత్‌కు కూడా కరోనా సోకింది.

మహారాష్ట్రలో 10 మందికి పైగా మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కరోనాకు గురయ్యారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.  

Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kohli retirement : విరాట్ కోహ్లీ ఆఖరి వన్డే ఆడేసినట్టేనా? సంచలనంగా మారుతున్న సైగలు!
విరాట్ కోహ్లీ ఆఖరి వన్డే ఆడేసినట్టేనా? సంచలనంగా మారుతున్న సైగలు!
Kalki 2898AD Sequel: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
Fauji First Look: ప్రభాస్ 'Z' సీక్రెట్ రివీల్ - డార్లింగ్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ వచ్చేసింది... బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
ప్రభాస్ 'Z' సీక్రెట్ రివీల్ - డార్లింగ్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ వచ్చేసింది... బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
Telangana Latest News: తెలంగాణలో మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌- వీఆర్‌ఎస్‌ కోసం రిజ్వీ అప్లికేషన్- ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ 
తెలంగాణలో మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌- వీఆర్‌ఎస్‌ కోసం రిజ్వీ అప్లికేషన్- ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ 
Advertisement

వీడియోలు

కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
New Zealandతో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్‌.. టీమ్‌లో కీలక మార్పులు
1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kohli retirement : విరాట్ కోహ్లీ ఆఖరి వన్డే ఆడేసినట్టేనా? సంచలనంగా మారుతున్న సైగలు!
విరాట్ కోహ్లీ ఆఖరి వన్డే ఆడేసినట్టేనా? సంచలనంగా మారుతున్న సైగలు!
Kalki 2898AD Sequel: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
Fauji First Look: ప్రభాస్ 'Z' సీక్రెట్ రివీల్ - డార్లింగ్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ వచ్చేసింది... బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
ప్రభాస్ 'Z' సీక్రెట్ రివీల్ - డార్లింగ్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ వచ్చేసింది... బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
Telangana Latest News: తెలంగాణలో మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌- వీఆర్‌ఎస్‌ కోసం రిజ్వీ అప్లికేషన్- ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ 
తెలంగాణలో మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌- వీఆర్‌ఎస్‌ కోసం రిజ్వీ అప్లికేషన్- ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ 
South India Destinations : చలికాలంలో సౌత్ ఇండియాలో ట్రిప్​కి వెళ్లగలిగే ప్రదేశాలు ఇవే.. కూర్గ్ నుంచి కూనూర్ వరకు
చలికాలంలో సౌత్ ఇండియాలో ట్రిప్​కి వెళ్లగలిగే ప్రదేశాలు ఇవే.. కూర్గ్ నుంచి కూనూర్ వరకు
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికల బరిలో 81 మంది! నామినేషన్ల స్క్రూట్నీలో హైడ్రామా!
జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికల బరిలో 81 మంది! నామినేషన్ల స్క్రూట్నీలో హైడ్రామా!
Medchal Crime News: గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్‌పై కాల్పుల కేసులో పురోగతి- ముగ్గురు అరెస్టు, పరారీలో మరో నిందితుడు
గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్‌పై కాల్పుల కేసులో పురోగతి- ముగ్గురు అరెస్టు, పరారీలో మరో నిందితుడు
Bigg Boss Telugu Today Promo : బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. బురదలో గేమ్ ఆడుతోన్న కంటెస్టెంట్లు
బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. బురదలో గేమ్ ఆడుతోన్న కంటెస్టెంట్లు
Embed widget