Covid 19 Vaccine: భయపడకండి.. బూస్టర్ డోస్ వచ్చేసింది.. చుక్కల మందుకు డీసీజీఐ అనుమతి!
భారత్ బయోటెక్ తయారు చేసిన చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు' కింద వినియోగించేందుకు సూత్రప్రాయంగా డీసీజీఏ అనుమతి ఇచ్చింది.
దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ బూస్టర్ డోసుపై మరోసారి చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు' కింద వినియోగించేందుకు సూత్రప్రాయంగా డీసీజీఏ అనుమతి ఇచ్చింది.
Govt top panel drug controller approves @BharatBiotech intranasal vaccine phae 3 trial as boosters yet another milestones in our fight against pandemic.congratulations team of bharatbiotech team @SuchitraElla on the path of visionary @PMOIndia @narendramodi ji #AtmanirbharBharat
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 5, 2022
క్లినికల్ పరీక్షలకు ఓకే..
ఇందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ). అనుమతులకు అవసరమైన పత్రాలు, క్లినికల్ పరీక్షల ప్రక్రియను సమర్పించాలని స్పష్టం చేసింది.
దాదాపు 5,000 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని భారత్ బయోటెక్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో సగం మందిని కొవాగ్జిన్, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
బూస్టర్ డోస్ ఇదేనా..
ఈ చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఇందులో సగం మందిని కొవాగ్జిన్, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది.
బూస్టర్ షాట్‌నే ప్రికాషన్ డోస్‌గా కూడా పిలుస్తున్నారు. బూస్టర్ డోసును ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైద్యుల సూచన మేరకు ఇవ్వనున్నారు.
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి