RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Hyderabad : ఆర్పీ పట్నాయక్ కుమారుడ్ని ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
RP Patnaik Son : కాలేజీల్లో ర్యాగింగ్ భూతం ఎవర్నీ వదిలి పెట్టడంలేదు. తాజాగా తన కుమారుడు ర్యాగింగ్ బారిన పడ్డాడని.. సీనియర్లు తన కుమారుడి చెవి కొరికేశారని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఈ మేరకు కంప్లైంట్ ఇచ్చారు. తన కొడుకు వైష్ణవుని ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికారని ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు.
ఆర్పీ కుమారుడు వైష్ణవ్ చెవి కొరికిన సీనియర్
ఆర్పీ పట్నాయక్ కుమారుడి పేరు వైష్ణవ్. ఆయన ఓ ప్రముఖ కాలేజలో ఎంబీఏ చదువుతున్నారు. ప్రతీ రోజూ కాలేజీకి బస్‌లోనే వెళ్లి వస్తారు. ఇలా కాలేజీకి బస్‌లో వెళ్తున్న సమయంలో బస్సులో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారన్నారు. వైష్ణవ్ ప్రశ్నించడంతో దాడి చేసి చెవి కొరికారని ఫిర్యాదు చేశారు. చెవి కొరికిన విద్యార్థి పేరును శ్యామ్ గా గుర్తించినట్లుగా ఆర్పీపట్నయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు కూడా సమర్పించడంతో ఆర్పీపట్నాయక్ పిర్యాదుపై రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేశారు.
కౌన్సిలింగ్ పేరుతో చేయి చేసుకున్న ఎస్సై- మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య- సంచలనం రేపుతున్న ఘటన
ర్యాగింగ్ పై ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మళ్లీ మళ్లీ గొడవలు
కాలేజీల్లో ర్యాగింగ్ అంశం తరచూ వివాదాస్పదమవుతూనే ఉంది. అయితే.. కొన్ని సార్లు వ్యక్తిగతంగా జరిగే దాడులను కూడా ర్యాగింగ్ గా చెబుతున్నారు. కాలేజీల్లో విద్యార్థులు గ్రూపులుగా మారి గొడవలకు దిగుతున్నారు.సీనియర్లు.. జూనియర్లను ర్యాగింగ్ చేస్తూండటంతో సమస్యలు పెరుగుతున్నాయి. పోలీసులు కాలేజీల్లో ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఆగడం లేదు. పైగా కాలేజీల్లో గంజాయి వినియోగం పెరిగిపోతోందని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై సీరియస్ గా స్పందించారు. కాలేజీల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని.. వాటిని కట్టడి చేస్తే.. విద్యార్థులు చాలా వరకూ దారిలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
ఆర్పీపట్నాయక్ కుమారుడు చదివే కాలేజీ నగరంలోని ప్రముఖకాలేజీ. అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుతూ ఉంటారు. ఒకే గ్రూపులో ఉన్న వారిని మరో గ్రూపులో ఉన్న సీనియర్లు వేధించడం కామన్ గా మారిపోయింది. భవిష్యత్ పాడైపోతుందన్న కారణంగా ఇలాంటి ర్యాగింగ్‌లు బయటకు రావు. అయితే ఆర్పీ పట్నాయక్ కుమారుడిపై ర్యాగింగ్ పేరుతో దాడి జరగడమే కాదు.. చెవి కూడా కొరకడంతో.. ఈ విషయం.. ఆయన వరకూ వచ్చింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలన్న కారణంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.