అన్వేషించండి

Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

Circar Express Robbery: సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దోపిడీ యత్నం జరిగింది. ప్రయాణికులు ప్రతిఘటించడంతో దొంగలు బ్యాగులు వదిలేసి అక్కడినుంచి పారిపోయారు.

Circar Express Robbery | బాపట్ల: తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక సుమారు 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ దోపిడీ యత్నం జరిగింది. 

సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోంచి దుండగులుబంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో పాటు, తోటి ప్రయాణికులు చైన్‌ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. మొత్తం ఆరుగురు దొంగలు రైలులో చోరీకి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 


Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

పారిపోతున్న దొంగలు.. 9 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు

రైలు ఆగగానే దొంగలు కిందకు దూకి చీకట్లో పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలులో ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి దొంగలను ఛేజ్ చేశారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో పోలీసులు ఏకంగా 9 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపగా, దుండగులు చీకట్లోకి వెళ్లి పారిపోయే ప్రయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు రూరల్ పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అప్పికట్ల-బత్తిపూడి పరిసర పొలాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read: Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?

Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న వరుస ఘటనలు

ఈ రైల్వే పరిధిలో దొంగల ముఠాలు వరుస చోరీలకు పాల్పడుతుండటం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. 3 వారాల కిందట బాపట్ల సరిహద్దులోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో దొంగలు రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్‌ చేసి రైలును ఆపి చోరీకి యత్నించారు. ఆ సమయంలోనూ రైల్వే పోలీసులు అప్రమత్తమై కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ దొంగలు తప్పించుకున్నారు. వరుసగా జరుగుతున్న ఈ రైల్వే దొంగతనాలు స్థానిక పోలీసు వ్యవస్థకు, రైల్వే భద్రతా దళాలకు పెద్ద సవాల్‌గా మారాయి.

కేరళ, బెంగళూరు మార్గాల్లోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. కేవలం 2 నెలల వ్యవధిలో, 20 కిలోమీటర్ల పరిధిలోనే ఇలాంటి వరుస ఘటనలు జరిగాయి. గత ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపంలో బెంగళూరు-నర్సాపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళల మెడల్లోంచి దుండగులు 130 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 

Frequently Asked Questions

సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు ఎక్కడ దొంగతనానికి ప్రయత్నించారు?

తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ దోపిడీ యత్నం జరిగింది.

దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

రైలు ఆగగానే దొంగలు పారిపోవడానికి ప్రయత్నించగా, రైల్వే పోలీసులు ఛేజ్ చేశారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో గాల్లోకి 9 రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ దొంగతనంలో ఎవరికి నష్టం జరిగింది?

సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోంచి దుండగులు బంగారు ఆభరణాలను లాక్కున్నారు.

ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయా?

అవును, 3 వారాల క్రితం నిడుబ్రోలు సమీపంలో, అలాగే గత ఏప్రిల్ 19న అప్పికట్ల వద్ద దొంగలు రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్‌ చేసి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget