Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Road Accident in Mahabubnagar | మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Mahabubnagar Road Accident | పాలకొండ: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న పాలకొండ సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక స్పోర్ట్స్ బైక్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులలో ఇద్దరు బైక్‌పై ప్రయాణిస్తుండగా, మిగిలిన ముగ్గురు కారులో ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న వేగానికి రెండు వాహనాలు బాగా ధ్వంసమయ్యాయి. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. నటుడు, కెమెరా మెన్ మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో టాలీవుడ్ నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ మృతి చెందారు. నెల్లూరుకు చెందిన వీరిద్దరూ సినీ రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో పదేళ్ల క్రితం నగరానికి వచ్చి నానక్‌రామ్‌గూడలో నివసిస్తున్నారు. ఇటీవల సొంతూరికి వెళ్లి తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు బొంగుళూరు సమీపంలో కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్, త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భరత్ కాంత్ 'టెనెంట్' చిత్రంతో హీరోగా గుర్తింపు పొందగా, త్రిలోక్ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ఎదుగుతున్న దశలో వీరిద్దరి అకాల మరణం టాలీవుడ్‌లో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















