అన్వేషించండి

Hyderabad Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంలో బీటెక్ విద్యార్థి దారుణ హత్య! కత్తులతో పొడిచి చంపిన యువతి బంధువులు

Tragic Murder in Secunderabad | ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబసభ్యులు ఓ బీటెక్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్యచేశారు. సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

BTech Student Killed Over Love Affair | హైదరాబాద్: ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ఇందిరానగర్ ప్రాంతంలో గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు బీటెక్ విద్యార్థిని టార్గెట్ చేసి కత్తులతో పొడిచి చంపారు. కత్తులతో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ వ్యవహారంపై యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల యావన్ అనే బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కత్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తుండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు, గతంలోనే యావన్‌ను పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం.Hyderabad Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంలో బీటెక్ విద్యార్థి దారుణ హత్య! కత్తులతో పొడిచి చంపిన యువతి బంధువులు

వార్నింగ్ ఇచ్చినా మారడం లేదని హత్యకు ప్లాన్

యువతి కుటుంబసభ్యుల హెచ్చరికలను లెక్కచేయకుండా యావన్ తరచూ సీతాఫల్‌మండి ఇందిరానగర్‌లోని తన ఫ్రెండ్స్ వద్దకు వస్తూ లవర్‌ను కలుస్తుండేవాడు. దీనిపై కక్ష పెంచుకున్న యువతి బంధువులు, అతడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి యావన్ తన స్నేహితుడి గదిలో టీవీ చూస్తుండగా, మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణాలు కాపాడుకోవడానికి యావన్ బయటకు పరుగెత్తినప్పటికీ, నిందితులు అతడ్ని వెంబడించి అంతా చూస్తుండగానే వీధిలోనే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. గొంతులో కత్తి పోట్లు ఎక్కువగా ఉన్నాయి.

తీవ్ర రక్తస్రావంతో యావన్ అక్కడికక్కడే మృతి చెందగా, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించగా, మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చెట్టంత ఎదిగిన కొడుకు త్వరలో చేతికి అందొస్తాడని, మంచి జాబ్ చేసి తమను పోషిస్తాడని భావించామని.. కానీ వాడి ప్రాణాలు తీశారంటూ యావన్ తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget