అన్వేషించండి

Hyderabad Crime News: గూగుల్ వెతికి మరీ గొంతుకోశారు! చింతల్‌లో సంచలనంగా మారిన మర్డర్!

చింతల్ అంబేద్కర్ నగర్‌లో శివారెడ్డి అనే వ్యక్తితో పదేళ్లుగా గార్లపల్లి అరుణ సహజీవనం చేస్తున్నారు. తాగి వచ్చి హింసిస్తున్నాడని తన కుమారుడితో కలిసి హత్య చేసి టెక్నాలజీ సహాయంతో తప్పించుకోవాలని చూశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సహజీవనం చేస్తున్న వ్యక్తిని తల్లికొడుకులు దారుణంగా హత్య చేశారు.
  • యూట్యూబ్, గూగుల్ సహాయంతో హత్యకు, తప్పించుకోవడానికి ప్లాన్ చేశారు.
  • శవాన్ని తరలించేటప్పుడు యజమానికి అనుమానం రావడంతో దొరికిపోయారు.

Hyderabad Crime News:హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలో జరిగిన హత్య సంచలనంగా మారింది. హత్య జరిగిన తీరు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహజీవనం చేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా నిద్రలోనే పరలోకానికి పంపేశారు తల్లీ,కొడుకులు. శవాన్ని మాయం చేసే క్రమంలో ఇంటి ఓనర్‌కు అనుమానం రావడంతో పోలీసులకు చిక్కారు. దీంతో మొత్తం మర్డర్ స్కెచ్ బయటపడింది.

చింతల్ అంబేద్కర్ నగర్‌లో శివారెడ్డి అనే వ్యక్తితో పదేళ్ల క్రితం గార్లపల్లి అరుణకు పరిచయం ఏర్పడింది. బాలానగర్‌లోని సూర్య ఇంజనీరింగ్ వర్క్స్‌లో ఇద్దరూ పని చేస్తుండగా ఏర్పడిన పరిచయం కాస్తా, సహజీవనం వరకూ వెళ్లింది. గత పదేళ్లుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. శివారెడ్డితో పరిచయానికి ముందే అరుణకు, సాయిరత్నం అనే కొడుకున్నాడు. తల్లి,కొడుకూ వాళ్లు ఉంటున్న ఇంట్లోనే శివారెడ్డికి ఆశ్రయం కల్పించారు. అలా బాలానగర్ సమీపంలో ఒకే ఇంట్లో ఉంటున్న ముగ్గురూ ఇటీవల చింతల్ అంబేద్కర్ నగర్‌కు ఇల్లు మారారు.

రోజూ మద్యం సేవించే అలవాటున్న శివారెడ్డి , తప్పతాగి ఇంటికొచ్చి అరుణను ,  ఆమె కుమారుడు సాయిరత్నాన్ని విపరీతంగా వేధించేవాడు. మానసికంగా ,  శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. అలా శివారెడ్డి వేధింపులు భరించలేని తల్లి, కొడుకులూ కలసి శివారెడ్డిని హతమార్చేందుకు ప్లాన్ చేశారు. 

హత్య చేయాలనుకున్న నాటి నుంచి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లారు తల్లీ , కొడుకులు . ముందుగా యూట్యూబ్ వీడియోలను చూసిన కొడుకు సాయిరత్నం, శివారెడ్డిని ఎలా చంపాలనేది ప్లాన్ చేశాడు. యూట్యూబ్ వీడియోల తల్లికి చూపించిన హత్యకు ప్లాన్ చెప్పాడు. గూగుల్ సహాయంతో కత్తి ఎక్కడ కొనాలి, హత్య తరువాత ఎలా తప్పించుకోవాలనేది రూట్ మ్యాప్ సైతం సిద్దం చేసుకున్నారు. 

అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేసేందుకు ఈనెల 3వ తేది అర్థరాత్రి దాటిన తరువాత, రోజూ మాదిరి తప్పతాగి ఇంటికొచ్చిన శివారెడ్డికి ఏమాత్రం అనుమానం రాకుండా , భోజనం పెట్టి పడుకోబెట్టారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో అప్పటికే కొనుగోలు చేసిన మటన్ కత్తితో, ఒకరు పట్టుకోగా, మరొకరు అత్యంత కిరాతకంగా గొంతు కోశారు. శివారెడ్డి ప్రాణాలు కోల్పోయాడని నిర్దారించుకున్న తరువాత శవాన్ని సంచిలో మూటకట్టి, తరలించే క్రమంలో స్థానికులకు, ఇంటి యజమానికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు తరువాత నిందితులను  తమ స్టైల్‌లో విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. గూగుల్ ఉపయోగించి, హత్యకు ప్లాన్ వేసినట్లు, హత్య తరువాత ఎలా తప్పించుకోవాలో కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా స్కెచ్ వేసినట్లుగా నిందితులు అంగీకరించారు. మంచి కోసం ఉపయోగించే గూగుల్ టెక్నాలజీని ఇలా హత్యల కోసం వాడేస్తుండటం పోలీసులకు సైతం షాకిచ్చింది. 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో ఎక్కడ ఈ హత్య జరిగింది?

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలో, చింతల్ అంబేద్కర్ నగర్‌లో ఈ హత్య జరిగింది.

హత్యకు గల కారణం ఏమిటి?

సహజీవనం చేస్తున్న శివారెడ్డి రోజూ మద్యం సేవించి, అతని భాగస్వామి అరుణను, ఆమె కొడుకు సాయిరత్నాన్ని వేధించడం, చిత్రహింసలకు గురిచేయడమే హత్యకు కారణం.

హత్య ఎలా జరిగింది?

తల్లి, కొడుకులు కలిసి పక్కా ప్లాన్‌తో, నిద్రపోతున్న శివారెడ్డిని మటన్ కత్తితో గొంతు కోసి హత్య చేశారు.

హత్య తర్వాత నిందితులు ఏమి చేశారు?

శవాన్ని సంచిలో మూటకట్టి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఇంటి ఓనర్‌కు అనుమానం రావడంతో పోలీసులకు చిక్కారు.

హత్యకు ప్లాన్ చేయడానికి నిందితులు ఏమైనా ఉపయోగించారా?

అవును, కొడుకు సాయిరత్నం యూట్యూబ్ వీడియోలు, గూగుల్ సహాయంతో హత్యకు ప్లాన్ చేశాడు. హత్య తర్వాత ఎలా తప్పించుకోవాలో కూడా గూగుల్ మ్యాప్స్‌తో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
NPS Sanchay Scheme: అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?
అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
Govt Schemes For Girls: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
NPS Sanchay Scheme: అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?
అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?
Embed widget