Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
Actor Bharath Kanth Dies | రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడు భరత్ కాంత్, కెమెరా మెన్ త్రిలోక్ మృతి చెందారు.

Hyderabad ORR Road Accident | హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు భరత్ కాంత్ (31), కెమెరామెన్ త్రిలోక్ (31) అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఊహించని విషాదం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వీరిద్దరూ సినీ రంగంలో రాణించాలనే లక్ష్యంతో దాదాపు పదేళ్ల క్రితం నగరానికి వచ్చి, నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్న నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నటుడు భరత్ కాంత్.. కత్తి మోహనరావు, జయలక్ష్మిల కుమారుడు కాగా, కెమెరా మెన్ త్రిలోక్.. గూడా మాల్యాద్రి శర్మ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు. కాగా, టెనెంట్ సినిమాలో హీరోగా చేసి భరత్ కాంత్ గుర్తింపు తెచ్చుకోగా, మరోవైపు త్రిలోక్ సినిమాటోగ్రాఫర్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. 
సొంతూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యక్తిగత పనుల ఉండటంతో సొంతూరు నెల్లూరుకు వెళ్లిన వీరిద్దరూ, శనివారం రాత్రి కారులో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెద్దఅంబర్‌పేట వద్ద ఓఆర్ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా, బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.

నుజ్జునుజ్జయిన కారు.. ఇద్దరు దుర్మరణం
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న నటుడు భరత్, కెమెరామెన్ త్రిలోక్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద తీవ్రంగా ఎంతలా ఉందంటే.. కారు వేగంతో ఢీకొట్టిన ధాటికి కంటైనర్ లారీ వెనుక చక్రాలు సైతం ఊడిపోయాయి. ఇద్దరు వర్దమాన సినీ కళాకారులు ఇలా అకాల మరణం చెందడం వారి కుటుంబంతో పాటు బంధువులు, సన్నిహితులను విషాదంలోకి నెట్టేసింది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















