Railway Worker Died: బిహార్‌లో హృదయ విదారక ఘటన - రైలు ఇంజిన్, బోగీల మధ్య నలిగి కార్మికుడు మృతి
Barauni Railway Station: విధుల్లో ఉన్న రైల్వే పోర్టర్ రైలు ఇంజిన్, బోగీల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన బిహార్‌లో శనివారం చోటు చేసుకుంది.
Railway Worker Died In Barauni Railway Station: రైలు ఇంజిన్, బోగీల మధ్య నలిగి విధుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన బిహార్ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లో (Barauni Railway Junction) శనివారం చోటు చేసుకుంది. హృదయ విదారక దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. రైలు, ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్ విడదీసే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖ్‌నవూ - బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలు (15204) శనివారం ఉదయం బరౌనీ స్టేషన్‌లోని ప్లాట్ ఫాం నెం.5 కు చేరుకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తోన్న రైల్వే పోర్టర్ అమర్ కుమార్.. ఇంజిన్, బోగీల మధ్య ఉండే కప్లింగ్ విడదీస్తుండగా.. ఇంజిన్ రివర్స్ అయ్యింది. ఈ క్రమంలో వాటి మధ్య నలిగి ప్రాణాలు కోల్పోయాడు.
అప్పటికే ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో లోకోపైలట్ ఇంజిన్‌ను ముందుకు నడిపే ప్రయత్నం కూడా చేయకుండా.. వెంటనే ఇంజిన్ దిగి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
Also Read: Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్, హౌరాకు సమీపంలో ఘటన