అన్వేషించండి

పాడైన సెల్‌ఫోన్‌ నిందితులను పట్టించింది- పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతి కేసులో మలుపు

పోక్సో స్పెషల్ ప్రాసిక్యూటర్ ది సహజ మరణం కాదని పోలీసులు తేల్చారు. భార్యతో సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజం 53 రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని మరణం సహజమైనది కాదని పోలీసులు తేల్చారు. ఈ సంఘటనలో ఆజం తండ్రి తన కుమారుని మృతి సహజమైనది కాదని అతనికి లభ్యమైన కొన్ని ఆధారాలను జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబును సంప్రదించి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది.

ఖననం చేసిన మృతదేహానికి పరీక్షలు..

పోక్సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 53 రోజుల క్రితం చనిపోగా.. కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించారు.  అయితే అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఖననం చేసిన ఆజం మృతదేహానికి పోలీసులు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ వ్యవహారంలో మొత్తం ఆజాం భార్యతో సహా మరో ఏడుగురు పాత్ర ఉందన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. 

అనుకోకుండా దొరికిన ఆధారం..

ఈ ఏడాది జూన్ 23న స్పెషల్ ప్రాసిక్యూటర్ అక్బర్ గుండె పోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు స్థానిక ముస్లిం స్మశాన వాటికలో ఖననం చేశారు. 45 రోజుల అనంతరం అనుకోకుండా దొరికిన ఆధారం వల్ల అక్బర్ తండ్రి హుస్సేన్ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును కలిశారు. తన కుమారుని మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ చేయాల్సిందిగా అభ్యర్థించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలనం కలిగించే విషయాలను గుర్తించారు. అక్బర్ ది సహజమైన మరణం కాదని, ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు అక్బర్ భార్య అహ్మద్ ఉన్నీషా బేగం, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. శనివారం కాకినాడలోని సాంబమూర్తి నగర్ ముస్లిం స్మశాన వాటిక లో మృతదేహానికి పోరెన్సిక్ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఈ కేసులో మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

పాత సెల్ ఫోనే పట్టించిందా..?

ఫోక్సో స్పెషల్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజం స్థానికంగా మంచి పేరున్న వ్యక్తి. స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితోపాటు వైసీపీ నాయకులతో ఈయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. తన భార్య ఉనీషా బేగం సెల్ ఫోన్ పాడవడంతో  కొత్త సెల్ ఫోన్ కొనిచ్చాడు ఆజం. అయితే పాత ఫోను బాగు చేయించుకుని వాడుకోమని తన తండ్రికి ఇచ్చాడు. ఈలోపు కుమారుని మరణంతో దాన్ని పక్కన పెట్టిన ఆజాం తండ్రి.. ఇటీవల ఓ సెల్ ఫోన్ షాపులో ఇచ్చి రిపేర్ చేయించాడు. బాగు చేయించుకున్న సెల్ ఫోన్ లో సిమ్ కార్డు వేసుకుని వినియోగిస్తున్న క్రమంలో అందులో కొన్ని కాల్ రికార్డింగ్స్ బయట పడ్డాయి. ఆ రికార్డింగ్స్ విన్న ఆజం తండ్రికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. దాంట్లో అక్బర్ ఆజాంను అంతం చేయాలని జరిగిన సంభాషణలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆజాం తండ్రి.

వివాహేతర సంబంధమే అంతమొందించిందా..? 

న్యాయవాదిగా మంచి పేరున్న అక్బర్ ఆజాం తన భార్య వివాహేతర సంబంధం వల్లనే హత్యకు గురయ్యాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది సమాచారం. ఈ ఉదంతంలో అక్బర్ ఆజం భార్యతోపాటు మరో ఏడుగురిని కాల్ డేటా, వాయిస్ కాల్ రికార్డింగ్స్ ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి రాగా త్వరలోనే జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు ప్రెస్ మీట్ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget