By: ABP Desam | Updated at : 09 Jan 2022 03:47 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుని.. ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి వద్దకే వెళ్లి.. మీ కుమార్తె వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తుందని చెప్పి డబ్బులు అడిగాడు. అయితే దీనిపై అనుమానం వచ్చిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు వివరాల్లోకి వెళ్తే..
మీ అమ్మాయి.. ఓ వ్యక్తితో చాటింగ్ చేస్తుందంటూ.. బోగస్ చాటింగ్ ను చూపి.. వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేశాడు ఓ వ్యక్తి. శ్రీనగర్‌కాలనీలో నివసించే వైద్యుడు బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో ఓ భవన నిర్మాణం చేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం నిర్మాణం జరుగుతున్న ప్లాట్‌లోకి ఓ వ్యక్తి వచ్చి తన పేరు అయ్యప్పగా పరిచయం చేసుకున్నాడు. తాను ట్రావెల్ వెహికిల్స్ డ్రైవర్‌నని చెప్పుకొచ్చాడు. ప్లాట్‌ను ఓఎన్‌జీసీకి అద్దెకు ఇస్తారా అని అడిగాడు.
వీళ్లిద్దరూ మాట్లాడుతుండగానే.. ఓఎన్‌జీసీ ఆఫీసర్‌నంటూ కొద్దిసేపట్లోనే మరో వ్యక్తి అక్కడకు వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. సాయంత్రం మరోసారి అయ్యప్ప ఆ ప్రాంతానికి వచ్చాడు. వైద్యుడిని కలిసి సెల్ ఫోన్ లో చాటింగ్ చూపించాడు. నీ కుమార్తె.. మరో వ్యక్తితో చాటింగ్ చేసిందంటూ డిలీట్ చేయాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు.
ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే నీ అంతు చూస్తామంటూ.. బెదిరించాడు. వైద్యుడు భయంతో.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు అయ్యప్పపై పోలీసులు ఐసీసీ సెక్షన్ 448, 385, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Jagityal: పొదల్లో కాపు కాచి మరీ యువకుడి హత్య.. తల్వార్‌లతో నరికి.. జగిత్యాలలో దారుణం
Also Read: CrIme News: విజయవాడలో నిజామాబాద్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య
Also Read: పెద్దోళ్లను ఎదిరించి లవర్‌ను దక్కించుకున్న ప్రియుడు.. యువతి కోరిక నచ్చక ఘాతుకం
Also Read: మావోయిస్టుల కుట్ర ఛేదించిన ఒడిశా పోలీసులు... మల్కన్‌గిరిలో భారీ డంప్ నిర్వీర్యం...
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!
Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?