Karimnagar: పెద్దోళ్లను ఎదిరించి లవర్‌ను దక్కించుకున్న ప్రియుడు.. యువతి కోరిక నచ్చక ఘాతుకం
యువతిపై అత్యాచారం చేసి ప్రియుడు చంపేశాడు. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.
ప్రేమించిన యువతి తనకు దక్కలేదని ఒకప్పుడు గొడవలు చేసిన ఆ ప్రియుడే చివరకు పెళ్లి చేసుకోమని అడిగేసరికి మృగంగా మారాడు. యువతిపై అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
మన్నం పల్లికి చెందిన పోచమ్మ - రవి దంపతులకు సంతానం లేకపోవడంతో చిన్న వయసులోనే వరలక్ష్మి అనే అమ్మాయిని తమకు తోడుగా ఉంటుందని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న వరలక్ష్మి కరోనా కారణంగా కాలేజీ సరిగా లేకపోవడంతో కొన్నాళ్లుగా ఇంటి వద్దనే ఉంటోంది. తల్లిదండ్రులు మేకలు కాయడానికి లక్ష్మిని అప్పుడప్పుడు పంపించేవారు. అలా ఈ నెల రెండో తేదీన సమీపంలోని గుట్టలకి మేపడానికి వెళ్లిన వరలక్ష్మి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. ఆమె మిత్రులను సైతం ప్రశ్నించారు. ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈనెల 5న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విచారణ మొదలు పెట్టిన పోలీసులు.. ఆమెతో కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న అఖిల్ అనే యువకుడిని అనుమానించి అతణ్ని పిలిచి విచారణ జరిపారు. ఇందులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. చెంజర్ల సమీపంలోని గుట్టల్లో అత్యాచారం చేసి చంపేశానని ఆ స్థలానికి తీసుకెళ్ళి చూపించాడు. అదనపు డీసీపీ శ్రీనివాస్ ఎల్ఎండీ, మానకొండూరు సీఐలు శశిధర్రెడ్డి, కృష్ణా రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
పెళ్లి కోసం అడగడంతోనే?
అప్పటి వరకు ప్రేమించుకున్న తాము పెళ్లి వరకు వచ్చేసరికి విభేదాలు బయటపడ్డాయని.. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తానే చున్నీతో ఉరివేసి చంపానని అఖిల్ ఒప్పుకున్నాడు. గతంలో మైనర్‌లుగా ఉన్న సమయంలోనే అమ్మాయి పరిచయం అయిందని, అప్పట్లో గొడవలు జరగడంతో కుటుంబ సభ్యులు, పెద్ద మనుషుల సమక్షంలో పలు మార్లు పంచాయితీ కూడా నిర్వహించారని తెలిపాడు. మరోవైపు, తాము ఇద్దరం కలుసుకోకుండా ఆంక్షలు సైతం విధించారని అఖిల్ విచారణలో తెలిపాడు.
దీంతో కొద్దిరోజులుగా దూరంగా ఉన్న తాము మళ్ళీ ఈ మధ్యే మాట్లాడుకుంటున్నామని ఈ సమయంలో తాము మేజర్లుగా మారడంతో వరలక్ష్మి తరచూ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది కానీ తాను మాత్రం వదిలించుకోవాలనే ఆలోచనతోనే పథకం ప్రకారం ఈ హత్యా పథకాన్ని అమలు చేశానని వివరించాడు. ఏదీ ఏమైనా మైనర్లుగా పరిచయం అయిన యువతీ యువకులు చివరికి అర్ధరహితమైన పనులతో ఒకరు ప్రాణాలను కోల్పోగా, మరొకరు అమూల్యమైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!